రష్మిక మందన్నా ఏ సినిమా చేసినా సరే అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. గత కొద్ది సంవత్సరాలు గా స్టార్ హీరోల కంటే ఎక్కువ సక్సెస్ లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో మరోసారి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అద్భుతమైన విజయం అందుకోవడంతో చిత్ర నిర్మాతలు ఖుషిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను తొలిప్రేమ మిగిల్చిన చేదు అనుభవాలను పంచుకుంది రష్మిక. ఇక ఆ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. నేను మొదట ఓ రిలేషన్ షిప్ లో ఇరుక్కున్నప్పుడు చాలా వేదన అనుభవించాను.

అందులో నుండి బయటపడే అవకాశం కూడా లేదు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డాను. అలాంటి సమయంలో ఇప్పుడున్న పార్ట్నర్ నాకు ఎంతో హెల్ప్ చేశాడు.ఆ బాధల నుండి బయటపడ్డాను అంటే దానికి కారణం ఇప్పుడున్న పార్ట్నరే.. ఇక నేను తాజాగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా ఇంచుమించు నా నిజ జీవితం లాగే ఉంది. అందుకే ఈ సినిమాని ఒప్పుకున్నాను. నా రియల్ లైఫ్ లో ఉన్న కొన్ని సంఘటనలు,చేదు అనుభవాలు ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే సినిమాలో నటించాను.

 ఇక సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ సమయంలో కూడా విజయ్ నాకు అండగా నిలిచాడు. అన్నింటినీ పట్టుకొని కూర్చోవద్దు అని ఎంతో సపోర్ట్ ఇచ్చేవాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది రష్మిక మందన్నా. అయితే తొలిప్రేమ చేదు జ్ఞాపకాలను మిగిల్చింది అని చెప్పింది కానీ తన తొలిప్రేమ ఎవరు.. ఆయన పేరు ఏంటి అనేది మాత్రం బయట పెట్టలేదు. అయితే చాలామంది మాత్రం రష్మిక ఫస్ట్ లవ్ రక్షిత్ శెట్టి కాబట్టి ఆయన్ని ఉద్దేశించే ఈ కామెంట్లు చేసిందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: