అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే—రాజమౌళికి సంబంధించిన ఓ ‘సెంటిమెంట్’ను మహేష్ బ్రేక్ చేస్తాడా? అనే విషయం. రాజమౌళి సినిమాల్లో నటించిన పలువురు హీరోలు షూటింగ్ సమయంలో గాయాలపాలైన విషయాన్ని మనం చాలాసార్లు చూశాం. ‘బాహుబలి’ సమయంలో ప్రభాస్‌కు గాయాలు అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ షూట్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ కూడా కొన్ని సార్లు సెట్స్ మీద గాయపడ్డారు. రాజమౌళి చిత్రాలలో ఉండే యాక్షన్ సీక్వెన్స్‌ల తీవ్రత, ఆయన కోరుకునే పర్ఫెక్షన్ కారణంగా హీరోలు ఫిజికల్‌గా చాలానే ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది.
ఇప్పుడు ‘వారణాసి’లో కూడా మహేష్ బాబు అత్యంత రగ్గడ్ లుక్‌తో, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ చేస్తారనే సమాచారం వస్తోంది. దీంతో ఈసారి మహేష్ బాబు కూడా ఈ ‘గాయం సెంటిమెంట్’ను ఫాలో అవుతారా? లేక ఆయనే రాజమౌళి మూవీస్‌లో ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన తొలి హీరో అవుతారా? అనే ఆసక్తి పెరిగింది. మహేష్ బాబు చాలా ఫిట్‌గా ఉండటం, తన శిక్షణపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అలాగే ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి మరింత ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో సమాచారం రావడంతో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎప్పటిలాగే ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ టెక్నీషియన్‌లతో రూపొందుతున్న ‘వారణాసి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి