ఈ ఏడాదిలో ‘డ్రాగన్’, ‘పరదా’, ‘కిష్కింధపురి’, ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’, ‘ది పెట్ డిటెక్టివ్’, ‘బైసన్’ వంటి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ, గ్లామర్ నుంచి పనితనం వరకు ప్రతీ రోల్‌ని భిన్నంగా చేయడానికి ప్రయత్నించి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రతి సినిమాలో ఆమె పాత్రకీ, లుక్‌కీ ఉన్న వేరియేషన్ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇంతటితో ఆమె స్పీడు ఆగలేదు. ఇంకా మరో చిత్రం ‘లాక్‌డౌన్’ కూడా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైపోవటంతో, ఈ ఏడాది మొత్తంలో స్క్రీన్‌పై ఎక్కువసార్లు కనిపించిన హీరోయిన్‌గా అనుపమ కొత్త రికార్డును సెట్ చేసింది. ఇటువంటి కాన్సిస్టెన్సీ, ఇంత వరుస ప్రెజెన్స్ చాలా అరుదుగా కనిపిస్తుంది.
సాధారణంగా స్టార్ హీరోయిన్‌లకు కూడా ఒకే ఏడాదిలో అంతమంది చిత్రాలను విడుదల చేయడం చాలా కష్టం. కానీ అనుపమ మాత్రం తన కష్టంతో, కట్టుబాటుతో, పాత్రల పట్ల ఉన్న ప్యాషన్‌తో ఈ ఫీట్‌ను సాధించడం నిజంగా ప్రశంసనీయం. ఫ్యాన్స్ అయితే “ఇదే అసలు రేర్ ఫీట్… అనుపమ దమ్ము చూపించింది” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వరదలా పెడుతున్నారు.ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్క ప్రశ్నే—ఈ రికార్డును వచ్చే ఏడాది ఎవరైనా బ్రేక్ చేస్తారా? లేక అనుపమ పరమేశ్వరన్ రేర్ ఫీట్ ఇంకా ఎన్నేళ్లైనా చెదరనిదిగానే నిలుస్తుందా? అన్నది చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి