అలాగే, విడుదలైన కొద్ది రోజుల్లోనే ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడ గట్టి హోల్డ్ సాధించింది. భారీ వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డులపై దండయాత్ర చేసిన ఈ సినిమా తాజాగా మరొక అరుదైన రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది. థియేటర్లలో అద్భుతమైన స్థిరత్వంతో పరుగులు తీస్తూ, ఈ చిత్రం 50 రోజుల విజయవంతమైన థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తమను ఆదరించిన ప్రేక్షకులకు టీమ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.ఒక వైపు థియేట్రికల్ రన్‌లో దూసుకుపోతూ మరో వైపు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా సత్తా చూపుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిషబ్ శెట్టితో పాటు తెరపై కీలక పాత్ర పోషించిన రుక్మిణి వసంత్ నటన కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఆమె పాత్రకు అవసరమైన భావోద్వేగాల్ని అందంగా తెరపైకి తీసుకువచ్చిందని విమర్శకులు మెచ్చుకుంటున్నారు.
అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపథ్య సంగీతం సినిమా ప్రధాన ఆకర్షణగా మారింది. యాక్షన్ సన్నివేశాలు గానీ, పూజా వాతావరణం గానీ, దేవರ ಜಾತ್ರೆಯ దివ్యత్వం గానీ – ప్రతి సందర్భానికీ తగినట్టుగా అద్భుతమైన రాగాల్ని వినిపించిన విధానం ప్రేక్షకుల్ని మరో లోకానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. మొత్తం మీద, ‘కాంతార చాప్టర్ 1’ సాధించిన ఈ కొత్త అరుదైన విజయం కేవలం ఒక సినిమా రికార్డు మాత్రమే కాదు… భారతీయ సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన ఓ సంస్కృతిక గర్వకారణం కూడా అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి