తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం కుమారి 21 F అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 2015 వ సంవత్సరం నవంబర్ 20 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఆ సమయం లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటి తో పది సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి పది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భం గా ఈ సినిమాకు ఆ సమయం లో వచ్చిన కలెక్షన్లు మరియు లాభాల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి ఆ సమయం లో నైజాం ఏరియాలో 5.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ 1.42 కోట్లు , ఉత్తరాంధ్ర లో 1.45 కోట్లు , ఈస్ట్ లో 89 లక్షలు , వేస్ట్ 157 లక్షలు , గుంటూరు లో 86 లక్షలు , కృష్ణ లో 83 లక్షలు , నెల్లూరు 26 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని 1.82 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తం గా ఈ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 13.65 కోట్ల కనెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 13.65 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ ఆ సమయం లో 8.65 కోట్ల లాభాలను అందుకొని అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: