సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరియర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. ఇకపోతే బాలకృష్ణ ఎంతో మంది హీరోయిన్లతో నటించిన ఆయనకు అద్భుతంగా కలిసి వచ్చిన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఆ ఇద్దరు హీరోయిన్లతో ఆయన చాలా సినిమాల్లో నటించాడు. అలాగే ఆయనకు వారితో మంచి విజయాలు కూడా దక్కాయి. మరి బాలకృష్ణ.కు అంతలా కలిసి వచ్చిన ఆ ఇద్దరు నటీ మణులు ఎవరు అనుకుంటున్నారా ..? వారు మరేవరో కాదు ... ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి ఒకరు మరియు ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కెరీర్గా కొనసాగిస్తున్న నయనతార.

 బాలకృష్ణ , విజయశాంతి కాంబో లో కొన్ని సంవత్సరాల క్రితం అనేక సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో వీరి కాంబోలో సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమా పై ఆ సమయంలో అద్భుతమైన అంచనాలు ఏర్పడేవి. ఆఖరుగా వీరి కాంబినేషన్లో నిప్పు రవ్వ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబో లో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇకపోతే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ కు బాగా కలిసి వచ్చిన నటిమలలో నయనతార ఒకరు. వీరి కాంబినేషన్లో మొదటగా సింహా అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత శ్రీరామ రాజ్యం ఆ తర్వాత జై సింహా అనే సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే బాలకృష్ణ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే సినిమాలో నయన తార హీరోయిన్గా కనిపించబోతుంది. దానితో బాలకృష్ణ , నయనతార కాంబో లో రూపొందబోయే నాలుగో సినిమా కూడా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని బాలయ్య అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: