నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ అయినటువంటి అఖండ మూవీ కి కొనసాగింపుగా పొందుతున్న ఆఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమా కావడంతో అఖండ 2 మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ క్రేజీ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం వారు రెండు పాటలను , కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఇక ఈ మూవీ లోని రెండు పాటలు మరియు ప్రచార చిత్రాలు కూడా ఈ మూవీ పై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్న స్థాయిలో లేకపోవడంతో చాలా మంది ఈ మూవీ అఖండ స్థాయి విజయాన్ని అందుకుంటుందా ..? లేదా అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సమయం లోనే బాలయ్య అభిమానులు మాత్రం ఇప్పటివరకు ఈ సినిమా నుండి చాలా లిమిటెడ్ గా ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అది అద్భుతమైన రేంజ్ లో ఉంటుంది. దానితో ఒక్క సారిగా ఈ సినిమా ట్రైలర్ బయటకి రాగానే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరిపోతాయి , ఈ మూవీ అఖండ మూవీ కంటే పెద్ద విజయం సాధిస్తుంది అని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. అలాగే బాలయ్య , బోయపాటి శ్రీను కాంబో లో ఇప్పటివరకు వచ్చిన సింహా , లెజెండ్ , అఖండ మూడు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఆ మూడు సినిమాల కంటే అఖండ 2 మూవీ మంచి విజయం సాధిస్తుంది అని బాలయ్య అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: