ఇక మరో వైపు, ఈ సినిమా బీజేపీకి అనుకూలంగా ఉన్న రాజకీయ కాన్సెప్ట్ అని కొన్ని వర్గాలు ప్రచారం చేయడం మొదలు పెట్టాయి. దేవుడు కాన్సెప్ట్, వారణాసి నేపథ్యం, హిందూ పురాణాల రిఫరెన్సులు—ఇవి అన్నింటినీ రాజకీయ కోణంలో చూపించే ప్రయత్నం జరిగింది. కానీ ఈ వ్యాఖ్యలపై కూడా రాజమౌళి ఏ ఒక్క మాట మాట్లాడలేదు. సామాన్యంగా రాజమౌళి ఒక విషయం పైన చాలా ఆలోచించి, పూర్తిగా సిద్ధమైన తర్వాతే రియాక్ట్ అవుతారు అనేది ఆయనకు దగ్గరైన వాళ్ల మాట. కానీ ఈసారి ఆయన పూర్తిగా నిశ్బ్ధంగా ఉండటం జనాల్లో మరింత సందేహాలు రేపుతోంది.
అయితే ఆయన ఫ్యాన్స్ మాత్రం మరో కోణం చెబుతున్నారు. రాజమౌళి ఎందుకు స్పందించట్లేదంటే—ఆయన విశ్వసించే కాన్సెప్ట్‌పై ఆయనకు ఉన్న అచంచల నమ్మకం..ఎవరు ఎం మాట్లాడినా పట్టించుకోని స్ట్రాంగ్ మైండ్‌సెట్.. సినిమా విడుదలైన తర్వాతే అసలైన సమాధానం ఇస్తానన్న ధీమా..తన టాలెంట్‌ని మాటలు కాదు, పని ద్వారా నిరూపించాలనే స్టైల్స్ .ఫ్యాన్స్ మాత్రం ధీమాగా, “ఎవరెంత ట్రోలింగ్ చేసినా, సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్లీ రాజమౌళి వద్దే అందరూ కొట్టుకురాగలరు. హిట్‌తోనే ఆయన అందరికీ జవాబు చెబుతారు" అంటున్నారు. మొత్తానికి… నెట్టింట తుపాన్ లాంటి ట్రోల్స్ కొనసాగుతున్నా, రాజమౌళి మాత్రం తన పని మీద ఫోకస్ పెట్టి బిగ్ సైలెన్స్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ సైలెన్స్ వెనుక ఆయన నమ్ముతున్న ఐడియా, ఆయన కాన్ఫిడెన్స్, ఆయన సినిమా మీద ఉన్న బలమైన నమ్మకమే ప్రధాన కారణమని చెప్పాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి