సినిమా పరిశ్రమలో కాస్టింగ్ ప్రక్రియ గురించి చాలామందికి కొంత అవగాహన ఉన్నప్పటికీ, దాని లోపలి కథలు బయటకు రావడం అరుదు. తాజగా, ఒక పాపులర్ హీరోయిన్ కెరీర్‌లోని తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను సరికొత్త ఉత్సాహంతో ప్రారంభించిన ఈ బ్యూటీ గురించి అనేక వార్తలు వైరల్ అవుతూ ఉండటం గమనార్హం. టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో వరుసగా హిట్ సినిమాలు చేసిన ఈ హీరోయిన్, ఒకప్పుడు ఓ స్టార్ హీరోతో కలిసి చేసిన రెండు చిత్రాలతో బాక్సాఫీస్ కలెక్షన్లను రికార్డు స్థాయికి తీసుకెళ్లినట్లు అందరికీ తెలిసిందే. ఈ కాంబినేషన్ వస్తే కలెక్షన్ల వర్షం కురుస్తుంది అనే  నమ్మకం అప్పట్లో ఫ్యాన్స్‌లో బలంగా ఉండేది.


అయితే ఈ బ్యూటీ కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. అప్పట్లో ఒక భారీ సినిమాకి ఎంపికైన ఆమె తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతుండగా, ఆ చిత్రానికి చెందిన ప్రముఖ దర్శకుడి అసిస్టెంట్ ఆమె వద్దకు వచ్చాడట. “సార్ మీతో మాట్లాడాలంటున్నారు… రూం‌కి రమ్మంటున్నారు” అంటూ ఆయన చెప్పిన తీరు ఆమెకి అసహజంగా తోచిందని ప్రచారం. ఒక వర్గం చెబుతున్నదాని ప్రకారం—ఆ అసిస్టెంట్ చెప్పిన విధానం చూసి హీరోయిన్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోయిందట. “నోరు మూయ్ రా…!” అంటూ ఘాటు మాటలు పలికి, వెంటనే కారవాన్ దిగి సెట్‌ని వదిలి ఇంటికి వెళ్లిపోయిందని అంటారు. తరువాత పెద్దల మధ్యవర్తిత్వంతో ఆమె కోపం తగ్గి, తిరిగి షూట్‌లో పాల్గొన్నట్లు ప్రచారం.



మరో వర్గం మాత్రం పూర్తిగా భిన్నమైన కథ చెబుతోంది— ఆ ఘటన తర్వాత ఆమెకు ఈ పరిశ్రమలో ఎలా ‘కమిట్‌మెంట్స్’ పేరుతో ఒత్తిళ్లు వస్తాయో అర్థమై, వాటికి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకుందట. ఆ వ్యవహారాన్ని దర్శకుడు కూడా అప్పుడు సైలెంట్‌గా హ్యాండిల్ చేసి, విషయం బయటకు రావకుండా చూసుకున్నాడని వారు అంటున్నారు.ఈ కథల్లో ఏది నిజం, ఏది కేవలం ఊహాగానమో స్పష్టంగా తెలియకపోయినా… ఇప్పుడిప్పుడే రెండో ఇన్నింగ్స్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీపై పాత సంఘటనల కథలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు తమ తమ ఊహాగానాలతో ఈ విషయాన్ని మళ్లీ చర్చకు తెస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: