ఐబొమ్మ రవి.. అరెస్ట్ అయ్యి వారం రోజులైనా ఇతని పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. ఐబొమ్మ రవిపై పెట్టిన కేసులు చెల్లవని అతను  ఈజీగానే రిలీజ్ అవుతాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసుల విచారణలో భాగంగా ఐబొమ్మ రవి  కీలక విషయాలను వెల్లడించారు.  వందల సంఖ్యలో ఏజెంట్లు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో  ఐబొమ్మ రవికి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.

తమిళ వెబ్ సైట్ల నుంచి ఐబొమ్మ రవి ఎక్కువ శాతం సినిమాలను కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించారు.  కరేబియన్ దీవుల్లో ఆఫీస్ ఏర్పాటు చేసుకుని యూకేలో టెకీల  సాయంతో  పైరసీ సినిమాల దందాను కొనసాగించడని సమాచారం అందుతోంది.  సాఫ్ట్ వేర్ సహాయంతో సినిమాలను హెచ్డి  క్వాలిటీలోకి మార్చనని రవి చెప్పినట్టు తెలుస్తోంది.

బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే పైరసీ సినిమాలు కొన్నానని రవి చెప్పాడని భోగట్టా.  ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో  లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్,  విదేశీ పౌరసత్వం తీసుకున్నానని రవి చెప్పినట్టు సమాచారం.  కరేబియన్ దీవులలో తాను  ఏర్పాటు చేసిన కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని రవి వెల్లడించారు.  ప్రతి అడుగులో ఎదురైనా చేదు అనుభవాల వల్లే డబ్బు సంపాదనపై  దృష్టి పెట్టానని రవి చెప్పారని సమాచారం.

సైబర్ నేరగాళ్లు  తమ నేరాలకు  ఐబొమ్మ వెబ్ సైట్లను  పూర్తిస్థాయిలో  వేదికగా మలచుకుంటున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఐబొమ్మ రవి గురించి మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: