ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం. సోషల్ మీడియా, యూట్యూబ్, ఫిల్మ్ సర్కిల్స్—ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆతృత పెరిగిపోతోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యయ్యి. సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా బాలయ్య పూర్తిగా యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్వ్యూలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, స్పెషల్ ప్రమోషనల్ వీడియోలు—అన్నిటిలోను  టీం మొత్తం పనిచేస్తోంది. ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక భారీ వార్త బయటకు రావడంతో ఇండస్ట్రీ షేక్ అవుతుంది.


₹200 కోట్ల భారీ బడ్జెట్ – అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం:

సోషల్ మీడియాలో  వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భారీగా వ్FX పని, భారీ పాన్-ఇండియా లొకేషన్లు, ప్రత్యేక సెట్స్, యాక్షన్ ఎపిసోడ్‌లపై అమౌంట్ ఖర్చు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. పాన్-ఇండియా రేంజ్‌లో కంప్లీట్‌గా షెడ్యూల్ పూర్తి చేయడంతో ఖర్చులు మరింత పెరిగిపోయాయట.



స్టార్ రెమ్యూనరేషన్—బడ్జెట్‌కు సగం ఇదే!

ఇక అందరినీ ఇంకా ఆశ్చర్యపరిచిన విషయం ప్రధాన నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్స్.  నందమూరి బాలకృష్ణసినిమా కోసం  ₹45 కోట్లు పారితోషికం తీసుకున్నారని టాక్. దర్శకుడు బోయపాటి శ్రీను – దాదాపు ₹35 కోట్లు తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ బయటకు రావడంతో “బడ్జెట్‌లో సగం వీళ్లకే వెళ్లిపోయింది” అనే కామెంట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మిగతా బడ్జెట్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, హీరోయిన్, డైరెక్టర్ అసిస్టెంట్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్షన్ కొరియోగ్రాఫర్లు వంటి విభాగాలకు వెళ్లటంతో మొత్తంగా ఖర్చు భారీగానే నిలిచిందని తెలుస్తోంది.


సినిమా విడుదలకు ముందు నుంచి బిజినెస్ బాగా జరగడం మరో హైలైట్ గా మారింది. వరల్డ్‌వైడ్ థియేట్రికల్ మార్కెట్ విలువ ₹120 కోట్లకు పైగానే అనే మాట వినిపిస్తుంది. హిందీ మార్కెట్ పూర్తిగా వేరే అదనపు బిజినెస్ .శాటిలైట్, డిజిటల్, ఆడియో హక్కుల అమ్మకాలు కూడా స్ట్రాంగ్‌గా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అధికారికంగా వెల్లడికావాల్సి ఉన్నా, ఇండస్ట్రీలో ఈ నంబర్లు ఇప్పటికే పెద్ద హడావుడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాపై క్రేజ్, అంచనాలు, అన్ని వేరే లెవల్ లో ఉన్నాయి.  భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, బోయపాటి–బాలయ్య కాంబినేషన్, పాన్-ఇండియా రేంజ్— అన్ని కలిసొచ్చినందున ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక డిసెంబర్ 5న విడుదలైన తర్వాత ఈ హైప్ బాక్సాఫీస్ నంబర్లుగా ఎలా మారుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: