ఇప్పటికే ‘స్పిరిట్’ స్కేల్, బడ్జెట్, పాత్ర తీరు గురించి అనేక రూమర్లు, అనేక అంచనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం — దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక సంచలన వ్యాఖ్య చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ‘స్పిరిట్’ సినిమా రూ. 3500 కోట్లు వసూలు చేసే సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ అని, తాను అందుకు పూర్తి ధీమాతో ఉన్నానని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రీ గాసిప్. ఒక దర్శకుడు ఇంత భారీ మార్క్ గురించి నిస్సందేహంగా చెప్పడం అంటే — ఆయన కథ పట్ల, స్క్రీన్‌ప్లే పట్ల, ప్రభాస్ క్యారెక్టర్ పట్ల ఉన్న విశ్వాసం ఏ స్థాయిలోుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ వ్యాఖ్యలతో ప్రభాస్ అభిమానుల్లోనూ అసాధారణ ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే ‘బాహుబలి’ రెండు భాగాలు దేశవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దాదాపు చేరుకోలేని రికార్డులు సృష్టించాయి. ఆ తరువాత పుష్ప–2, జవాన్, పఠాథాన్ వంటి సినిమాలు భారీ కలెక్షన్లు సాధించినా — బాహుబలి మాత్రం ఇంకా ఇండియన్ బాక్సాఫీస్ బెంచ్‌మార్క్ గా నిలిచింది.అయితే వసూళ్ల మీద చర్చకు వస్తే… చాలామంది పేర్కొన్న పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, జవాన్ లాంటి సినిమాల నిజమైన కలెక్షన్లపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు అని ఇండస్ట్రీ విశ్లేషకులు చెబుతుంటారు. మరోవైపు అమెరికా, చైనా మార్కెట్లు ఇండియన్ సినిమాలకు వేగంగా మారుతున్న బంగారు బండారం లాంటివి. ఉదాహరణకు, అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా భారత్‌లో కేవలం ₹800 కోట్ల వరకే ఆగిపోయింది. కానీ చైనా మార్కెట్లో సంచలనంగా నిలిచి ₹1200 కోట్ల అదనపు వసూళ్లు సాధించింది. సందీప్ సినిమాలపై యువతలో ఉన్న మాస్ క్రేజ్, సినిమా కంటెంట్‌పై డైరెక్టర్ చూపుతున్న ఆత్మవిశ్వాసం ఇవన్నీ కలిస్తే ఈ సినిమా రికార్డులపై ఇప్పటినుంచే పెద్ద మోతాదులో చర్చలు మొదలయ్యాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి