ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టుల్లో ‘ఫౌజీ’ ఒకటి. ఈ సినిమా పై జనాలు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక తాజా సమాచారం ప్రకారం, హను రాఘవపూడి వర్క్‌కు ప్రభాస్ పూర్తిగా ఫిదా అయ్యాడట. అందుకే ఆయనతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్. అదే ఇప్పుడు ‘ఫౌజీ ప్రీక్వెల్’ గా ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో ఫౌజీ రిజల్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఫౌజీ హిట్ అయితే ప్రీక్వెల్ స్టార్ట్ అయ్యే అవకాశం పక్కా… లేదంటే ఆ ఐడియా స్టాప్ అయ్యే ఛాన్స్ ఉందట.ఏదేమైనా… ఫౌజీ మాత్రం మామూలు సినిమా కాదని ఇన్‌సైడర్స్ చెప్పుకుంటున్నారు. అంతే కాదు, సీక్వెల్స్‌తో మొదలైన ప్రభాస్ ప్లానింగ్ ఇప్పుడు ప్రీక్వెల్స్ దాకా వెళ్లడంతో — డార్లింగ్ ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు అని టాలీవుడ్ మొత్తం చర్చించుకుంటోంది. చూడాలి మరీ డార్లిం ఈ విషయంలో ఎంత వరకు సక్సెస్ అవుతారు అనేది..???
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి