నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమా కావడంతో అఖండ 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అఖండ 2 మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఇప్పటికే బాలయ్య తన తదుపరి మూవీ ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయడానికి పిక్స్ అయ్యాడు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల మూడో వారం నుండి ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బృందం వారు మొదటి షెడ్యూల్ లోనే ఈ సినిమాకు సంబంధించిన ఐటమ్ సాంగ్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లోని స్పెషల్ సాంగ్ లో కొంత కాలం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన తమన్నా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య , తమన్నా మధ్య ఐటం సాంగ్ అంటే అది అద్భుతంగా ఉంటుంది అని బాలయ్య అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమాలో నిజం గానే తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తుందో ..? లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: