టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మాస్ సినిమా ‘పెద్ది’ నుంచి వచ్చిన తొలి సాంగ్ ‘చికిరి చికిరి’ విడుదలైన నిమిషం నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. అదిరిపోయే బీట్‌లు, ఫోక్ ఫ్లేవర్, రహ్మాన్ ప్రత్యేకమైన సంగీతాత్మక ధోరణి కలిసి ఈ పాటను గ్లోబల్ సెన్సేషన్‌గా మార్చేశాయి. విడుదలై కొద్ది రోజుల్లోనే ఈ పాట అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల వ్యూస్‌ను దాటి మరో పెద్ద మైలురాయిని అందుకుంది. మరీ ముఖ్యంగా చికిరి సాంగ్ తెలుగు వెర్షన్ దూసుకెళ్తోంది. ఒక్క తెలుగు పాటకే దాదాపు 64 మిలియన్ వ్యూస్, దాదాపు 10 లక్షల లైక్స్ రావడం రామ్ చరణ్‌కు జన్మించిన సహజమైన ప్రజాదరణకు నిదర్శనం. అదే సమయంలో హిందీ వెర్షన్ 25 మిలియన్ వ్యూస్‌తో బలమైన స్థానం సంపాదించుకుంది. తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు కలిపి మరో 10 మిలియన్ల వ్యూస్ సాధించడం ‘చికిరి చికిరి’ పాటకు పాన్-ఇండియా రేంజ్‌ను చాటి చెప్పింది.
ఈ పాటపై అభిమానుల క్రేజ్ మరింత పెరగడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్. రా అండ్ రస్టిక్ సెలబ్రేషన్ వైబ్‌తో పాటు ఆయన డ్యాన్స్ స్టైల్ ఇంటర్నేషనల్ లెవల్ లో కూడా చర్చనీయాంశమవుతోంది. చరణ్ స్టెప్పులు, హుక్ మూవ్‌లను ఫాలో అవుతూ వేలాది మంది అభిమానులు రీల్స్, డ్యాన్స్ కవర్స్ చేస్తుండటం సోషల్ మీడియా అంతా ‘ చికిరి ’ వాతావరణాన్ని తీసుకువచ్చింది. యూట్యూబ్ , ఇన్‌స్టాగ్రామ్, రీల్ ప్లాట్‌ఫార్మ్‌లన్నీ ఈ పాటతో కిక్కిరిసిపోయాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సింగిల్‌తోనే ఇంత భారీ రెస్పాన్స్ రావడంతో ‘ పెద్ది ’ పై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. విడుదలకు ముందే హైప్ పీక్‌లోకి చేరడంతో ఇది రాబోయే ఏడాది అత్యంత క్రేజీ సినిమా లలో ఒకటిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి