టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ మాస్ జాతర ’ థియేటర్లలో విడుదలై కొంతవరకూ మంచి బజ్ తెచ్చుకున్నా, ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేకపోయింది. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్‌షో, భీమ్స్ సంగీతం వంటి పాజిటివ్ అంశాలు ఉన్నా సినిమా యొక్క ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ విషయంలో కూడా కొన్ని అంతర్గత చిక్కులు ఎదురయ్యాయనే వార్తలు బయటకు వచ్చాయి. హక్కులు ఎవరు తీసుకుంటారు? ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? వంటి అనేక ప్రశ్నలపై సందిగ్ధత నెలకొంది. కానీ ఆ అడ్డంకులన్నింటిని దాటి సినిమాకు ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఖరారైంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను పొందిన ప్రపంచ ప్రసిద్ధ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ , చివరికి ‘ మాస్ జాతర ’ ఓటిటి విడుదల తేదీని ప్రకటించింది. ఈ నవంబర్ 28 నుంచి హిందీ వెర్షన్‌ను మినహాయించి తెలుగు , తమిళం , కన్నడ , మలయాళ భాషల్లో సినిమా ను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు అధికారికంగా నిర్ణయించింది. దీంతో థియేటర్లలో చూసే అవకాశం కోల్పోయిన అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే రవితేజ మాస్ స్క్రీన్ప్రెజెన్స్ ను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ - శ్రీలీల జంట ను బుల్లితెర పై ఎంజాయ్ చేసేందుకు బుల్లితెర ఫ్యాన్స్ ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సృష్టించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఓటిటి రిలీజ్‌తో మరోసారి చర్చల్లోకి రానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి