అయితే ఈ సినిమా పూర్తిగా సెలెబ్రేషన్, ఫ్యాన్ మానియా వరకే పరిమితం కాదు. కథలో భావోద్వేగం బలంగా ఉందని సినిమా ఇంటర్నల్ వర్గాల ద్వారా తెలుస్తోంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే - రామ్ కెమిస్ట్రీ స్క్రీన్‌పై ఫ్రెష్‌గా, ఆకట్టుకునేలా ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్, రావు రమేష్ తండ్రి - కొడుకు ట్రాక్‌లో పలువురు ప్రేక్షకులకు మమతగా, హృదయాన్ని టచ్ చేసేలా ఉండబోతున్నాయట. అంతేకాక, రియల్ స్టార్ ఉపేంద్ర సూపర్ స్టార్ సూర్యగా కనిపించే ప్రతి సీన్ సినిమాలో ఎలివేషన్, డెప్త్ చాలా బాగా వచ్చాయని టాక్ ? ఇక వివేక్ – మెర్విన్ అందించిన సంగీతం ఇప్పటికే ఆల్బమ్‌ను చార్ట్‌బస్టర్ స్థాయికి చేర్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగ సన్నివేశాలకు మరింత బలం చేకూరుస్తుందని సెన్సార్ కమిటీ స్పెషల్‌గా ప్రశంసించినట్లు టాక్.
ప్రత్యేకంగా పల్లెటూరి బ్యాక్‌గ్రౌండ్ లో వచ్చిన ఎపిసోడ్‌లు, ముఖ్యంగా టెంపుల్ సీక్వెన్స్ సినిమా హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ నమ్మకం. దర్శకుడు మహేష్ బాబు పి. ప్రత్యేకమైన కథనం, మైత్రీ మూవీ మేకర్స్ భారీ నిర్మాణ విలువలు కలిసి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ను మాస్, ఎమోషన్ సినిమాను హిట్ చేస్తాయన్న ధీమాతో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాకు చివరి 30 – 40 నిమిషాలు ప్రాణం అని టాక్. హృదయాన్ని హత్తుకునేలా, స్ఫూర్తిదాయకంగా, థియేటర్ బయటకు వస్తూ ప్రేక్షకుల మనసులో మధురమైన భావాన్ని మిగిల్చేలా సినిమాను ముగించారని సెన్సార్ రిపోర్టులు చెబుతున్నాయి. ఫైనల్‌గా హీరో రామ్ పోతినేని కెరీర్‌లో ఇటీవలి సంవత్సరాల్లో అత్యంత ప్రామిసింగ్ ఫిల్మ్‌గా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఉండబోతోందంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి