మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ పెద్ది ’ చుట్టూ క్రేజ్ రోజురోజుకు ఆకాశాన్నంటుతోంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజంగా చెప్పాలంటే, ఈ ప్రాజెక్ట్‌కి నిర్మాతలు ఏం విడుదల చేసినా… అది బంగారంలా మారిపోతుంది. సినిమాకు ఉన్న ప్రీ - రిలీజ్ హైప్ ఈ స్థాయిలో ఉందంటే, రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ ఎటువైపు దూసుకెళ్తోందో అర్థమవుతుంది. ఫస్ట్ రిలీజ్ చేసిన పెద్ది గ్లింప్స్ సంచలన స్పందన తెచ్చుకుంది. అందులో చరణ్ చూపించిన రస్టిక్ బాడీ లాంగ్వేజ్, అతని బ్యాటింగ్ స్టైల్ సోషల్ మీడియాలో సునామీలా వైరల్ అయింది. ఆ తర్వాత వచ్చిన మొదటి సింగిల్ ‘చికిరి’ మాత్రం అసలు దుమ్ము రేపింది. పాట విడుదలైన వెంటనే ట్రెండింగ్‌లో దూసుకెళ్లి, కొద్దిరోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ దాటడం అరుదైన ఘనత.
ఫోక్ జోష్, మాస్ ఎనర్జీ, రహ్మాన్ సిగ్నేచర్ స్టైల్ అన్నీ కలిసి ఈ పాట సినిమాపై ఉన్న బజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఇదివరకటి కొంతకాలంగా “రహ్మాన్ ఫామ్ తగ్గిందా?” అనే చర్చ వినిపిస్తుండగా, ‘చికిరి’ పాట ఆ అనుమానాలన్నింటినీ చెరిపేసింది. తెలుగు ప్రేక్షకుల నాడిని, మాస్ హీరోల క్రేజ్‌ని రహ్మాన్ పట్టుకోలేకపోతున్నాడన్న విమర్శలకు ఈ పాటతో పూర్తిగా బ్రేక్ పడింది. రహ్మాన్ మళ్లీ పీక్‌లోకి వస్తున్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తూ పెద్ది రెండో పాట కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
డిసెంబర్‌లో, ముఖ్యంగా క్రిస్మస్ వారం సమయంలో ఈ సాంగ్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఈ సాంగ్ “చికిరి కంటే కూడా హయ్యెస్ట్ లెవెల్ మాస్ అట్రాక్షన్” కలిగి ఉంటుందని, ట్యూన్ మరియు విజువల్ ట్రీట్ అభిమానులను మరింత ఎక్స్‌సైటు చేస్తాయని సమాచారం. లిరికల్ వీడియోను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రహ్మాన్ ఈ ఆల్బమ్‌తో బిగ్ కంబ్యాక్ ఇస్తే, భవిష్యత్తులో తెలుగు స్టార్ హీరోలందరికీ ఆయన మళ్లీ ఓ కీలక ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి