నందమూరి అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘ఆదిత్య 999’ చుట్టూ మళ్లీ హాట్ చర్చ మొదలైంది. ‘ఆదిత్య 369’ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతస్థానం సంపాదించిన క్లాసిక్. ఆ సినిమాకు సీక్వెల్ వస్తే, ఒకవైపు ఆ సైన్స్ ఫిక్షన్ లెగసీని మళ్లీ అనుభవించే అవకాశం లభిస్తుంది. మరోవైపు బాల‌కృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ కూడా ఈ సినిమా ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇవ్వొచ్చనే భావనతో అభిమానులు మరింత ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ రెండు కోరికలు నెరవేరవచ్చన్న ఆశ ఆ ప్రాజెక్ట్‌పై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతోంది.
ఇప్పటికే ‘ ఆదిత్య 999 ’ కోసం విస్తృతమైన స్క్రిప్ట్ చర్చలు సాగుతున్నట్టు వార్తలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.


ఇటీవల ఈ ప్రాజెక్ట్‌లోకి దర్శకుడు క్రిష్ వస్తున్నారని, ఆయనే స్క్రిప్ట్ పనులు మొదలెట్టారని కథనాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌రీ ముఖ్యంగా బాలయ్య - క్రిష్ కాంబినేషన్‌కి ఉన్న అనుబంధమే ఈ వార్తలకు బలం ఇచ్చింది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మరియు ఎన్టీఆర్ బయోపిక్ వంటి పెద్ద ప్రాజెక్టులను ఇద్దరూ కలిసి చేశారు. అందుకే అభిమానులు సహా టాలీవుడ్‌ వర్గాలన్నీ “ఆదిత్య 999ను కూడా క్రిష్‌నే డైరెక్ట్ చేస్తాడు” అని నమ్మకం తో ఉన్నాయి. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ‘ఆదిత్య 999’ను చేయడం సాధ్యం కాదని, అందుకే బాలయ్యకు తన పరిస్థితి చెప్పి సినిమాను వదులుకున్నాడని టాక్.


ఈ వార్త నందమూరి అభిమానుల్లో నిరాశ కలిగించినప్పటికీ, క్రిష్–బాలయ్య మధ్య ఏ ఇబ్బందీ లేదని, ఇది పూర్తిగా క్రిష్ డేట్స్‌, క‌మిట్‌మెంట్స్ వ‌ల్లే అంటున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లు అందరూ తమ తమ పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వారు ఎప్పుడు ఫ్రీ అవుతారనే విషయం కూడా స్పష్టంగా లేదు. మరోవైపు బాలయ్య చేతిలో ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ప్రాజెక్ట్ ఉంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ కోసం కొత్త దర్శకుడి ఎంపిక, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ అన్నీ ప్రారంభం నుంచే మళ్లీ ప్లాన్ చేయాల్సి రావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: