అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచే సునామీ రేంజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ భారీ యాక్షన్ డ్రామా ఇప్పుడు అధికారికంగా ముహూర్త కార్యక్రమాలతో ప్రారంభమైనట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్ సినిమా స్థాయి, స్కేలు, బాలయ్య పాత్రల విన్యాసం గురించి స్పష్టంగా తెలియజేస్తోంది. పోస్టర్‌లో బాలయ్యను డ్యూయల్ రోల్‌లో చూపించారు. రెండు పాత్రలు రెండు భిన్న షేడ్స్‌తో, కానీ అదే స్థాయి మహా శక్తివంతమైన ఆరాను సంతరించుకొని కనిపించాయి.ఒక పాత్ర పూర్తి స్థాయి యుద్ధ వీరుడిగా, శత్రువుల హృదయాల్లో భయం నింపే రక్తపాత యోధుడిగా కనిపిస్తుండగా, మరొక పాత్ర షర్ట్ లేకుండా రుద్రాక్ష మాలలతో ఆధ్యాత్మిక శక్తి, భయంకర వేగం, దివ్యఔన్నత్యం కలగలిపిన రూపంలో కనిపిస్తోంది. ఈ ఇద్దరూ వేర్వేరు కోటలపై నిలబడి ఉండటం గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ప్రత్యేకమైన ప్రపంచం — ఒక భారీ విశ్వం — సృష్టించినట్టు కనిపిస్తోంది. ఇది సాధారణ చిత్రంలా కాకుండా, ఒక విజువల్ ఎపిక్‌గా రూపుదిద్దుకుంటుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ వారు నిర్మిస్తున్నారు. కథ, క్యారెక్టర్ డిజైనింగ్, యాక్షన్ సెటప్స్, టెక్నికల్ వాల్యూస్ ప్లస్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాను బాలయ్య Fఇల్మొగ్రఫ్య్లో మరొక మ్యాగ్నమ్ ఓపస్‌గా నిలబెట్టబోతున్నాయనే అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభమైన దశలోనే ఇంత భారీ హైప్ సృష్టించడం చూస్తే, బాలయ్య–గోపీచంద్ మలినేని కాంబినేషన్ తెలుగు సినిమా చరిత్రలో మరో మాస్ రికార్డ్ బ్లాస్టర్‌గా నిలవడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి