ఇలాంటి సమయంలోనే దర్శకుడు రాజ్ నిడమూరుతో సమంత రిలేషన్‌షిప్‌లో ఉందనే వార్తలు బయటపడ్డాయి. వీరిద్దరూ కలిసి క్లిక్ చేసిన కొన్ని రొమాంటిక్ ఫోటోలు నెట్టింట్లో తీవ్రంగా వైరల్ కాగా, అది మరింత అనుమానాలను రెచ్చగొట్టింది.
ఇదంతా జరుగుతుండగానే, తాజాగా సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త ప్రత్యక్షమైంది. “కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో నేదూ ఉదయం రాజ్ నిడమూరు – సమంతలు రహస్యంగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు” అన్న కథనం తెరపైకి వచ్చింది. సమంత ఎర్ర చీరలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నట్లు, రాజ్ నిడమూరుతో పాటు అతని ఆప్త మిత్రులు మాత్రమే హాజరయ్యారన్న వివరాలు కూడా వైరల్ అయ్యాయి. సమంత వైపు నుంచి ఆమె తల్లిమాత్రమే పాల్గొన్నారని ప్రచారం కొనసాగుతోంది.
ఈ వార్తలకు సంబంధించి ఇప్పటివరకు సమంత గాని, రాజ్ నిడమూరు గాని అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, “ఇన్‌సైడ్ సోర్సెస్” పేరుతో కొన్ని పేజీలు, మీడియా హౌసులు ఈ పెళ్లి నిజమేనని, సమంత రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిందని దాదాపు కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా కథనాలు రాస్తున్నాయి. అదే సమయంలో, సోషల్ మీడియాలో కొంతమంది సమంత పాత ఫోటోలను తీసుకుని, అవే పెళ్లి ఫోటోలని చెప్పి పోస్టులు పెడుతున్నారు. దీంతో అంతా గజిబిజి అయిపోయింది. అభిమానులు, నెటిజన్లు కూడా ఈ పిక్స్‌ను విపరీతంగా షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో “సమంత – రాజ్ నిడమూరు పెళ్లి ఫోటోలు” అనే హ్యాష్‌ట్యాగ్లు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి.
చివరికి…ఈ వార్తల్లో నిజం ఎంత? ఊహాగానాలు ఎంత? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. వీరిద్దరి నుండి అధికారిక ప్రకటన వస్తేనే అసలు నిజం బయటపడుతుంది. అందరి దృష్టి ఇప్పుడు ఆ జంటపైనే నిలిచిపోయింది—ఇంకొంచెం సేపట్లో అయినా సమంత, రాజ్ నిడమూరు ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వడం ఖాయమనిపిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి