ఫైనల్లీ, కోట్లాది మంది అభిమానులు ఎంతోకాలంగా ‘ఎప్పుడెప్పుడా?’ అని ఎదురుచూస్తున్న వార్త బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ సమంత తన రెండో పెళ్లిని పూర్తి చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. గత కొన్ని నెలలుగా సమంత వ్యక్తిగత జీవితంపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. డైరెక్టర్ రాజ్ నిడమూరు తో ఆమె తరచూ కనిపించడం, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి డైటింగ్ చేస్తుందనే వార్తలు రావడంతో నెటిజన్ల మధ్య పలు చర్చలు జరిగాయి. కొంతమంది అభిమానులు దీనిని పాజిటివ్‌గా తీసుకోగా, మరికొంత మంది నెగిటివ్ వ్యాఖ్యలతో స్పందించారు.


అయితే, చివర్లో సమంత తన మనసు చెప్పినదే చేసింది. తనకు నచ్చిన వ్యక్తిని, తనతో భావాలు కలిసిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. నేడు సమంత–రాజ్ నిడమూరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారని అధికారికంగా ప్రకటించింది. పెళ్లి వేడుక చాలా సాంప్రదాయబద్ధంగా జరిగినట్లు సమాచారం. సమంత తన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ అంతా ఉత్సాహంతో నిండిపోయింది. ఎర్రటి పట్టుచీరలో అద్భుతంగా ముస్తాబై పెళ్లికూతురిలా మెరిసిపోయిన సమంతను చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. ఇక రాజ్ నిడమూరు కూడా ట్రెడిషనల్ కుర్తా ధరించి చాలా ప్రత్యేకంగా కనిపించారు. ఈ ఫొటోలు పోస్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో వైరల్ అయ్యాయి.


ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోలికలు, మీమ్ లూ మొదలయ్యాయి. నాగచైతన్య–శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థ ఫోటోలు గతంలో ఎలా బాగా వైరల్ అయ్యాయో, ప్రస్తుతం సమంత–రాజ్ నిడమూరు ఫొటోలు కూడా అంతే స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా, శోభిత నాగచైతన్య చేతిని పట్టుకుని ఫోజులిచ్చిన ఫోటోలను, ఇప్పుడు సమంత రాజ్ చేయిపట్టుకుని ప్రేమగా చూసుకుంటూ దిగిన ఫోటోలను మ్యాచ్ చేస్తూ.. కొంతమంది నెటిజన్లు మీమ్‌స్ ట్రెండ్ చేస్తున్నారు. "ఇది రివెంజ్ పిక్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి సమంత తన కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఎంతో మంది అభిమానులు హర్షిస్తున్నారు. “ఎట్టకేలకు సమంతకు మంచి రోజులు వచ్చాయి”, “ఆమె జీవితంలో మళ్లీ ఆనందం ప్రారంభమైంది” అంటూ అనేక మంది శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: