స్టార్ హీరోలకు అనేక మంది అభిమానులు ఉంటూ ఉంటారు. ఇక ఆ హీరో అభిమానులు ఆ హీరో ఏ సినిమాలు ఓకే చేయకపోయినా , ఒక వేళ సినిమా ఓకే చేసి దాని అప్డేట్లను కరెక్ట్ విడుదల చేయకపోయినా వారు ఆ హీరో కెరియర్ విషయంలో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చిరంజీవిసినిమా ఓకే చేశాడు అంటే ఆ సినిమా ఓకే అయ్యాక ఆ సినిమా అద్భుతంగా రావడం కోసం చాలా కష్ట పడుతూ ఉంటాడు. చాలా రోజుల క్రితం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు.

మూవీ ని మొదలు పెట్టిన తర్వాత ఈ సినిమాను 2025 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేరునట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక 2025 వ సంవత్సరం సంక్రాంతి పండగ దగ్గర పడిన తర్వాత ఈ మూవీ ని 2025 వ సంవత్సరం సంక్రాంతి పండక్కి విడుదల చేయడం లేదు అని మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ మూవీ విడుదలపై అనేక తేదీలు వైరల్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం చిరంజీవి స్వయంగా విశ్వంబర మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దానితో మళ్లీ మెగా ఫ్యాన్స్ కాస్త ఆనంద పడ్డారు. ఇక ప్రస్తుతం చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై చిరంజీవి ప్రస్తుతం చాలా కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉండడం విశ్వంబర మూవీ కి సంబంధించి పెద్దగా ఏ అప్డేట్లు బయటకి రాకపోవడంతో మళ్లీ విశ్వంభర మూవీ గురుంచి చిరు ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి విశ్వంభర మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో అయినా విడుదల చేస్తారో ..? లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: