కాంతార చాప్టర్ 1..ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది కాంతార చాప్టర్ 1 సినిమానే అని చెప్పుకోవచ్చు.అలాంటి కాంతార చాప్టర్-1 సినిమా గురించి వెక్కిలి మాటలు మాట్లాడుతూ స్టేజి పైనే వెక్కిలి చేష్టలు చేసి ఆగ్రహం తెప్పించారు బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్.. దాంతో కొంతమంది కన్నడిగులు ఆయనపై ఫైర్ అవుతూ కేసులు పెట్టారు. బాలీవుడ్ వాళ్లకి సౌత్ ఇండస్ట్రీ అంటే చాలా చులకనా భావం ఉంటుంది.ముఖ్యంగా కొంతమంది టార్గెట్ చేసి మరీ సౌత్ స్టార్స్ ని అవమానిస్తూ ఉంటారు.అయినప్పటికీ సౌత్ ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు బాలీవుడ్ ని తొక్కుతూ ఎదుగుతోంది. బాహుబలి, కే జి ఎఫ్,పుష్ప, కాంతార వంటి సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాయి.సౌత్ ఇండస్ట్రీ సత్తా ఏంటో నిరూపించాయి. 

ఇదిలా ఉంటే రీసెంట్ గా గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ(IFFI) వేడుకల్లో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కాంతార చాప్టర్ 1 సినిమాని ఉద్దేశించి వెక్కిలి మాటలు మాట్లాడారు. కాంతార చాప్టర్ 1 సినిమాలోని చాముండి దేవత పాత్రను దేవత అని మాట్లాడకుండా దయ్యం అని అవమానించారు. అలాగే కాంతార చాప్టర్ 3 లో నాకు అవకాశం ఇస్తారా అని అడిగారు..అంతేకాకుండా కాంతార లోని 'ఓ' అనే శబ్దాన్ని కాస్త వెక్కిలిగా చేసి చూపించారు.టోటల్ గా ఆయన ప్రవర్తించిన ప్రవర్తన చాలా విసుగు తెప్పించింది.

ముఖ్యంగా ఈ వీడియో చూసిన చాలా మంది కన్నడిగులు ఆయనపై మండిపడ్డారు. దేవతను దయ్యంతో పోల్చడం ఏంటి.. పవిత్రమైన శబ్దాన్ని అలా అవమానిస్తూ బిహేవ్ చేయడం ఏంటి అని కోపగించుకున్నారు. దాంతో తాజాగా రణవీర్ సింగ్ పై కేసు నమోదు చేయాలంటూ హిందూ జన జాగృతి సమితి నేతలు గోవాలోని పనాజీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు కేసు పెట్టడమే కాకుండా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మరి రణవీర్ సింగ్ ఇప్పటికైనా తగ్గి క్షమాపణలు చెబుతారా.. లేక ఈ వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: