తెలుగు ఫిలిం సర్కిల్స్‌లో ప్రస్తుతం అత్యంత వేడివేడి‌గా చర్చ జరుగుతున్న అంశం హీరోయిన్ సమంత రెండో పెళ్లి. నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఇదే వార్త హాట్ టాపిక్‌గా కనిపిస్తోంది. టాలీవుడ్ మాత్రమే కాదు, నేషనల్ మీడియా వరకూ ఈ విషయం ట్రెండ్ అవుతోంది. “సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకుంది… లైఫ్ మూవ్ ఆన్ అవుతోంది” అంటూ కీలక న్యూస్ చానళ్లూ, ప్రముఖ వెబ్ పోర్టల్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నాయి..ఇక ఈ వార్తలపై సమంత కూడా ఫైనల్‌గా స్పందించింది. తన పెళ్లి ఫోటోలను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఆ వార్తలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఈ ఫోటోలు బయటకొచ్చిన క్షణాల్లోనే అభిమానులు సోషల్ మీడియాను కదిలేలా కామెంట్లు, విషెస్‌తో నింపేశారు. “సమంత లైఫ్ ఇకనైనా హ్యాపీగా సాగాలి”, “మెదటి బాధలు అన్నీ పోయి, కొత్త జీవితంలో సంతోషం మాత్రమే నిండాలి” అంటూ వేలాది మంది ఫ్యాన్స్ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.


అయితే సమంత పెళ్లి హవా ఇంకా తగ్గకముందే… మరో తెలుగు హీరోయిన్ పెళ్లి గురించి పెద్ద వార్త వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు — నేషనల్ క్రష్ రష్మిక మందన్న. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో “రష్మిక పెళ్లి” వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా దసరా సమయంలో, విజయ్ దేవరకొండ–రష్మిక నిశ్చితార్ధం చేసుకున్నారు అని.. త్వరలో పెళ్లి జరగబోతోందని న్యూస్ హల్‌చల్‌ చేసింది.అంతేకాదు, కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఫిబ్రవరి 26న రష్మిక–విజయ్ పెళ్లి జరుగుతుందనే టాక్ కూడా బాగా వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు రష్మిక మాత్రం ఒక్క స్పందన కూడా ఇవ్వలేదు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… సమంత కూడా తమ పెళ్లి గురించి ముందే ఏ సంకేతం ఇవ్వలేదు. ఎలాంటి అనుమానాలు రాకుండా ప్రశాంతంగా ఉండి, చివరికి పెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది.



ఇప్పుడు ఇదే పద్ధతిని రష్మిక కూడా ఫాలో అవుతుందేమో అన్న చర్చ మొదలైంది. “ఎవరికి చెప్పకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని, తర్వాతే పబ్లిక్‌కు అనౌన్స్ చేస్తుందట” అంటూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. రష్మిక–విజయ్ పేర్లు గత కొన్నేళ్లుగా ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. వీళ్ల మధ్య ఉన్న బాండింగ్‌ గురించి కూడా ఫ్యాన్స్ చాలా కాలంగా ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.సమంత లానే రష్మిక కూడా అకస్మాత్తుగా సీక్రెట్ మ్యారేజ్ చేసి, తర్వాతే ఆ ఫోటోలు రిలీజ్ చేస్తుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం చుట్టేస్తోంది. టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య ఈ చర్చ మరింత వేడెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: