తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా, హీరోగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే నందు. కానీ ఇండస్ట్రీ లోకి వచ్చి ఇప్పటికీ ఎన్నో ఏళ్ళు గడుస్తూ ఉన్న అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ విషయంపై తాజాగా తాను నటించిన సినిమా ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యారు నందు. తాను హీరోగా నటించిన తాజా చిత్రం సైక్ సిద్ధార్థ. ఇందులో యామిని భాస్కర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నందు కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కాబోతోంది.

ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో నిన్నటి రోజున(డిసెంబర్ 2) సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ట్రైలర్ ఈవెంట్ లో ఇంత ఎమోషనల్ అవ్వడం మీకందరికీ చాలా ఓవర్ గా కనిపించవచ్చు.. కానీ ఇదంతా కూడా నాకు ఒక జర్నీ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడారు. నేను ఇండస్ట్రీ లోకి వచ్చి 19 సంవత్సరాలు అవుతోంది.. నేనంటే చిన్నచూపు అంటూ ఒక పాడ్ కాస్ట్ వాళ్లు చెప్పారని ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా బాధ అనిపిస్తోందని తెలిపారు నందు.


పెళ్లిచూపులు చిత్రంలో తాను సెకండ్ హీరోగా నటించాను అందులో చేసిన హీరో ఒక పెద్ద స్టార్ గా మారారు. అందులో నటించిన  ప్రియదర్శి కూడా హీరోగా మారిపోయారని, నాకు పేరు వచ్చింది కానీ ఎందుకో సక్సెస్ రాలేదు.. తన ఫ్యాన్స్ నుంచి ఇప్పటివరకు తాను చేసిన పాత్రలలో నెగిటివ్ కామెంట్స్ రాలేదు ప్రతి సినిమాకి కూడా బెస్ట్ ఇస్తూనే ఉన్నాను.. ఇకమీదట కూడా ఇస్తూనే ఉంటాను..సినిమా చూడండి మీకు నచ్చకపోతే ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ క్షమాపణలు చెబుతాను తాను సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన ఇక్కడే ఉంటాను, చచ్చేవరకు సినిమాలు చేస్తానంటూ ఎమోషనల్ గా మాట్లాడారు నందు.

మరింత సమాచారం తెలుసుకోండి: