ఈ విజయోత్సాహం కొనసాగుతుండగానే రామ్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే కొంతమంది దర్శకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రత్యేకంగా, ఆయన ఓ తమిళ దర్శకుడితో చేతులు కలపబోతున్నారన్న వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రామ్, తమిళ టాప్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో వచ్చిన ‘ది వారియర్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు మళ్లీ ఒక తమిళ దర్శకుడితో రామ్ సినిమా చేయబోతున్నాడన్న వార్తపై సినీ వర్గాలు కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. “ఈ దశలో మరోసారి తమిళ డైరెక్టర్‌తో రిస్క్ ఎందుకు?” అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఇవన్నీ పక్కన పెడితే, తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని రామ్‌కి ఓ వినూత్నమైన కథను నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. తనదైన నేచురల్ కథనం, భావోద్వేగాలను బలంగా చూపించే స్టైల్‌తో సముద్రఖని ఇప్పటికే అనేక విజయాలు సాధించాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘బ్రో’ ద్వారా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు రామ్‌కి చెప్పిన ఈ కథ కూడా భావోద్వేగాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన కంటెంట్‌తో ఉందన్న సమాచారం లోపల వర్గాల నుంచి వినిపిస్తోంది.అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది అధికారికంగా తెలుస్తేనే స్పష్టత వస్తుంది. రామ్ ప్రస్తుతం స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి సముద్రఖనితో ఆయన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక ఇంకో డైరెక్టర్‌తో సెట్ అవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే రామ్ అభిమానులు మాత్రం తమ స్టార్ ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌లో, వినూత్నమైన కథతో ప్రేక్షకులను మళ్లీ అలరిస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. రామ్ తదుపరి ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు అని సినీ వర్గాలు చెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి