ఈ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు విడుదల అయిన తెలుగు సినిమాలలో విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 3 మూవీలలో మెగా హీరోలు నటించిన సినిమాలే ఉండడం విశేషం. నాలుగవ స్థానంలో బాలకృష్ణ నటించిన సినిమా ఉంది. తాజాగా బాలకృష్ణ "అఖండ 2" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం ఈ సినిమా తర్వాత భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఏవి కూడా విడుదల కావడానికి రెడీగా లేవు. దానితో అఖండ 2 మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో సూపర్ ప్లేస్ లో నిలుస్తుంది అని బాలయ్య అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇకపోతే ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఓజి సినిమా 64.56 కోట్ల షేర్ కలెక్షన్లను మొదటి రోజు రాబట్టి ఈ సంవత్సరం మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టు లో మొదటి స్థానంలో నిలిచింది.

మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన హరిహర వీరమల్లు సినిమా 39.93 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చెంజర్ మూవీ 39.52 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక బాలకృష్ణ హీరో గా రూపొందిన డాకు మహారాజ్ సినిమా 25.72 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. మరి అఖండ 2 మూవీ మొదటి మూడు స్థానాలలో నిలిచిన మెగా హీరోలా మొదటి రోజు కలెక్షన్లను బ్రేక్ చేసి అద్భుతమైన స్థానంలో నిలుస్తుంది అని బాలయ్య అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి అఖండ 2 మూవీ ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థానంలో నిలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: