ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హేమ సినీ కెరియర్, వివాహ బంధం, కుటుంబ ఇబ్బందులను కూడా తెలియజేసింది. ఇలాంటి సమయంలోనే ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ అనేది పాత విషయం.. ఇప్పుడు జమాన మారిపోయింది ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలు భయపడే పరిస్థితి ఏర్పడింది.. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ ని రిపోర్టర్స్ కూడా ఈ విషయం పైన అడిగితే ఎవరు ఇలాంటివి పేస్ చేయలేదని చెబుతున్నారు. ఇప్పటి జనరేషన్ వేరు! అప్పటి జనరేషన్ వేరు.. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏమీ లేవు ,చదువుకున్న వాళ్ళు వెల్ సెటిల్డ్ కుటుంబాల నుంచే ఇండస్ట్రీలోకి వస్తున్నారు.. కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాస్టింగ్ కౌచ్ అంటున్నారు. కానీ బయట కూడా అలాంటి పరిస్థితి ఉందంటూ తెలిపింది హేమ.
అయితే తాను మాత్రం ఎప్పుడు ఇలాంటిది ఫేస్ చేయలేదని ఎవరైనా సరే నాతో అలా మాట్లాడితే లెఫ్ట్ & రైట్ ఇచ్చిపడేస్తా అంటూ తెలియజేసింది హేమ. అలాగే సినిమాలు మానేశారా అనే విషయంపై యాంకర్ ప్రశ్నించగా?.. తాను మంచి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తానని తన మీద వచ్చిన ఆరోపణలలో క్లీన్ చీట్ వచ్చింది. కాబట్టి తాను ధైర్యంగా ఇప్పుడు అవకాశాలు అడుగుతానని నా అభిమానుల కోసం మళ్లీ తాను నటిస్తానంటూ తెలిపింది హేమ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి