తాజా సమాచారం ప్రకారం, పుష్ప–2 సినిమాను జపాన్‌లో 2026 జనవరి 16న గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్ణయించారు. స్థానిక ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే విధంగా ఈ చిత్రాన్ని ‘పుష్ప కున్రిన్’ అనే ప్రత్యేక టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా జపాన్ రిలీజ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ప్రత్యేక జపనీస్ పోస్టర్‌తో పాటు అధికారిక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. పోస్టర్‌లో అల్లు అర్జున్ లుక్, జపనీస్ టైపోగ్రఫీ — రెండూ కలిసి జపాన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదే విషయంపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జపాన్ అభిమానులకు ప్రత్యేకంగా అంకితం చేస్తూ —“పుష్ప కొత్త సంవత్సరంలో, జనవరి 16న జపాన్‌లో అడుగుపెట్టబోతోంది… మీరు సిద్ధంగా ఉన్నారా?” అంటూ ట్వీట్ చేశారు. పుష్ప బ్రాండ్‌కు జపాన్ వంటి కీలక మార్కెట్‌లో ఈ స్థాయి క్రేజ్ రావడం, భారతీయ సినిమాల అంతర్జాతీయ ప్రభావాన్ని మరోసారి రుజువు చేస్తోంది. రాబోయే వారాల్లో జపాన్ ప్రమోషన్లు మరింత వేగం తీసుకోనున్నట్లు సమాచారం. అభిమానులు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డు స్థాయి హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇదే మూమెంట్ లో రష్మిక తన పెళ్లికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇదే బాగుండు అనుకుంటున్నారు. విజయ్ తో రష్మిక పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పెళ్లికి సంబంధించి ఏదైన బిగ్ అనౌన్స్ మెంట్ ఇస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అనేది మాత్రం వాస్తవం..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి