అదేమిటంటే బోయపాటి శ్రీను చిన్న కుమారుడు వర్షిత్ ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తాను సినిమాలలో నటిస్తున్నానని వర్షిత్ కూడా తెలిపారు. అయితే తన పాత్ర ఏంటి అనే విషయం మాత్రం అభిమానులకు ఆసక్తి నెలకొంది. ఈ విషయం పైన డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లారిటీ ఇస్తూ అఖండ 2 చిత్రంలో తన కుమారుడు వర్షిత్ భక్త ప్రహల్లాదుడుగా కనిపించబోతున్నారంటూ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా సినిమా ట్రైలర్ లో కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే అందులో భక్త ప్రహ్లాదుడు గెటప్ లో ఉన్న బాలుడును చూడవచ్చు అంటూ బోయపాటి శ్రీను తెలియజేశారు.
అఖండ 2 చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించగా, ఆది పినిశెట్టి విలన్గా కీలకమైన పాత్రలో జగపతిబాబు, పూర్ణ , హర్షని మల్హోత్ర, మురళీకృష్ణ తదితర నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా రన్ టైమ్ కూడా 2 గంటల 46 నిమిషాలు ఉంటుంది. ఇందులో బాలకృష్ణ అఘోర పాత్రలో కూడా కనిపించబోతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో రేపటి రోజున తెలియనుంది.జై అఖండ అనే టైటిల్ తో అఖండ 3 ఉండబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి