భారత సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాలు రాసిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఎన్నో భారీ చిత్రాలు తెరకెక్కించినా..ఎప్పుడూ ఆయనకు ఎదురయ్యే ఒకే ఒక్క ప్రశ్న మాత్రం మారదు. అదేంటంటే—జపాన్ ఆడియెన్స్‌ ఎప్పుడూ ‘‘ప్రభాస్ ఎప్పుడు జపాన్ వస్తాడు?" అనే ప్రశ్నే. రీసెంట్ గా ‘బాహుబలి’ మరియు ‘బాహుబలి 2’ చిత్రాలను ఒకే ప్రదర్శనగా  చూపిస్తూ ‘భాహుబలి: ఠె ఏపిచ్’ పేరుతో విడుదల చేశారు. ఈ ప్రత్యేక జపాన్ ప్రీమియర్‌కు ప్రభాస్‌తో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్, రాజమౌళి పంపిన ప్రత్యేక లేఖను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు అది నెట్టింట బాగా వైరల్ అవుతుంది.


ఆ లేఖలో రాజమౌళి చాలా ఇమోషనల్‌గా అక్కడి అభిమానుల ప్రేమను గుర్తుచేసుకున్నారు. ఇప్పటివరకు తనకు నాలుగు సార్లు జపాన్ వెళ్లే అవకాశం దక్కిందని, ప్రతి సారి అక్కడి ప్రేక్షకులు మొదటి ప్రశ్నగా ‘‘ప్రభాస్ ఎప్పుడు వస్తాడు?’’ అని అడిగేవారని రాజమౌళి పేర్కొన్నారు. ఇంతటి ప్రేమ చూసి బాహుబలి చిత్రానికి మరో ఇల్లు కూడా జపాన్‌ అవుతుందని భావిస్తున్నాను అని పేర్కొన్నారు. అంతేకాదు, "బాహుబలి తన రెండో ఇంటికి తిరిగి చేరుకున్నాడు. ఈసారి అక్కడ నువ్వు కూడా అభిమానులతో గడుపుతావని నేను ఆశిస్తున్నాను" అంటూ ప్రభాస్ పట్ల తన ప్రత్యేకమైన అభిమానాన్ని రాజమౌళి ఆ లేఖలో వ్యక్తంచేశారు.



ప్రభాస్ కూడా ఆనందంతో స్పందిస్తూ, "ఈసారి మనిద్దరం కలిసి జపాన్‌ వెళ్లాలి అన్న రాజమౌళి గారి ఆలోచన నాకు చాలా నచ్చింది" అంటూ  సరదాగా స్పందించాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులంతా సూపర్ ఎక్సైటెడ్‌గా కామెంట్లు చేస్తున్నారు. దీంతో మరోసారి ఒకటి నిరూపించింది—జపాన్ ప్రేక్షకుల హృదయాల్లో ‘బాహుబలి’, ముఖ్యంగా ప్రభాస్‌ క్రేజ్ అస్సలు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ప్రభాస్ ఫ్యాన్స్ దీనిని బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: