రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్ ని తక్కువ చేసి మాట్లాడేది. అలాంటిది బాలీవుడ్ ఇండస్ట్రీకి చుక్కలు చూపించిన సినిమా అంటే బాహుబలి అని చెప్పుకోవచ్చు. కేవలం బాలీవుడ్ కి మాత్రమే కాదు ఇండియన్ బాక్సాఫీస్ ని, ప్రపంచ నలుమూలల ఉన్న సినీ అభిమానులని బాహుబలి సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్నీ కావు.ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయాయి. ముఖ్యంగా రాజమౌళి ప్రభాస్ ల ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. అయితే అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ప్రపంచ నలుమూలల తెలిసిన హీరో. కానీ అలాంటి ఈ హీరో ఎవరో తనకు తెలియదు అంటూ ఓ బాలీవుడ్ నటుడు అవమానించారు. 

మరి ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. రానా గతంలో బాహుబలి మూవీ ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ కి వెళ్లి సమయంలో ఓ బాలీవుడ్ నటుడిని కలిసారట. అలా కలవడంతోనే బాహుబలి సినిమా గురించి చెప్పగా చాలా ఎక్జైట్ అయ్యి స్టోరీ విన్నారట. కానీ ఆ తర్వాత ఈ సినిమాలో హీరో ఎవరు అని అడగగా.. ప్రభాస్ అని రానా చెప్పడంతో అసలు ఈ ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని ఏమీ తెలియనట్టుగా అడిగారట. దాంతో రానా షాక్ అయ్యారు..ఏంటి ప్రభాస్ తెలియదా అని మళ్లీ ప్రశ్నించగా.. నాకు నిజంగానే ప్రభాస్ ఎవరో తెలియదు.

నాకు తెలుగులో కొంతమంది పాత యాక్టర్స్ తెలుసు. వారిలో చిరంజీవి,వెంకటేష్ లు తెలుసు.ఇక ఇప్పటి తరం హీరోలలో చీను భర్త మాత్రమే నాకు సుపరిచితులు అని రానా ఆశ్చర్యపోయే  ఆన్సర్ ఇచ్చారట. ఇక చీను భర్త ఎవరు అనేది రానాకి కూడా తెలియలేదట.చీను అంటే ఎవరో కాదు మహేష్ బాబు భార్య నమ్రత.. హీరోయిన్ నమ్రత ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అంతేకాకుండా బాలీవుడ్ జనాలందరూ నమ్రతని చీను అని ముద్దుగా పిలుచుకునే వారట.అలా చీను భర్త మహేష్ బాబు మాత్రమే నాకు తెలుసు అంటూ ఆ బాలీవుడ్ యాక్టర్ చెప్పడంతో మహేష్ బాబుకి బాలీవుడ్ లో ఇంత ఫాలోయింగ్ ఉందా అని రానా ఆశ్చర్యపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి: