సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను కాస్టింగ్ కౌచ్ ల పేరుతో వాడుకోవడం చాలామందికి అలవాటైపోయింది. ఒకప్పుడు హీరోయిన్లు ఇలా కాస్టింగ్ గురించి బయట పెట్టడానికి భయపడేవారు. కానీ ఇప్పటి తరం హీరోయిన్స్ మాత్రం వారి పేర్లు బయట పెట్టకుండా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పుతున్నారు. కొంతమందైతే వారి పేర్లు కూడా ధైర్యంగా బయటపెడుతున్నారు ఇదంతా పక్కన పెడితే గతంలో ఓ నటి ఓ దర్శకుడు తనకి మద్యం తాగించి మరీ అత్యాచారం చేశాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ ఆ నటి ఎవరంటే..పోర్న్ స్టార్ గా పేరు తెచ్చుకున్న గెహానా వశిష్ట్.. ఆమె గతంలో ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చత్తిస్ ఘడ్ లోని ఓ చిన్న గ్రామం నుండి వచ్చాను. చదువులో ముందు నుండి టాపరే. కానీ నాకు చదువు మీద కంటే సినిమాల మీద ఇంట్రెస్ట్.

 అలా హీరోయిన్ కావాలి అనుకున్నాను. ఇక చదువును వదిలేసి అవకాశాల కోసం ముంబైకి వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి తాను బాలాజీ టెలీఫిల్మ్స్ లో దర్శకుడిని అని చెప్పుకున్నారు. దాంతో నేను ఆయన మాటల్ని నమ్మాను. ఆ తర్వాత ఒకరోజు ఆయన నీకు మద్యం తాగాక చేయవలసిన సీన్ వస్తే ఎలా యాక్టింగ్ చేస్తావు. ఒకసారి ఈ మద్యం తాగి నటించి చూపెట్టు అని కోరారు. అయితే మద్యం అలవాటు లేని నేను మద్యం తాగనని చెప్పాను. కానీ ఆ డైరెక్టర్ మాత్రం ఒత్తిడి చేసి నాతో మద్యం తాగించారు. ఇక మద్యం డోస్ ఎక్కువగా ఉండడంతో మత్తులోకి జారిపోయా. ఆ తర్వాత మత్తులో ఉన్న నన్ను ఆ డైరెక్టర్ అత్యాచారం చేశారు.

ఆ తర్వాత వారం రోజులపాటు హాస్పిటల్ లోనే ఉన్నాను. ఇక ఎలాగోలా హాస్పిటల్ నుండి తప్పించుకొని ఇంటికి వచ్చాక హెల్త్ బాగా లేకపోవడంతో మళ్లీ హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఇది కామన్ అని తెలిసి సినిమాల ఛాన్సుల కోసం ప్రయత్నించినప్పుడు అవకాశాలు రాకపోవడంతో బి గ్రేడ్ సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయ్యాను అని చెప్పింది. ఇక ఈ నటి పై శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర కంపెనీలో పోర్న్ మరియు అడల్ట్ కంటెంట్ తయారు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ ఆరోపణలపై కూడా ఆ ఇంటర్వ్యూలో గెహనా క్లారిటీ ఇస్తూ నేను కేవలం శృంగార కంటెంట్ ని మాత్రమే తయారు చేసేదాన్ని. కానీ రాజ్ కుంద్రా కంపెనీలో జరిగిన మిగతా దానితో నాకు సంబంధం లేదు.అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: