ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే కనుమరుగైపోయిన హీరోయిన్లలో పూనమ్ కౌర్ కూడా ఒకరు. అయితే నిరంతరం అటు రాజకీయాల పరంగా , సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు ఎల్లప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. అందుకే కొన్ని సందర్భాలలో ఈమె చేసే ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ వంటి వారిపైన పరోక్షంగానే కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.



తాజాగా పవన్ కళ్యాణ్ పై చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నాలెజినోవా  ఆదివారం(2026 జనవరి 26) మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాన్ ను సందర్శించారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను జనసేన పార్టీ వీర మహిళ విభాగం నుంచి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయగా, ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ సాంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. ఆ పక్కనే పవన్ కళ్యాణ్ భార్య కూడా నడుస్తూ ఉన్నట్లు కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.



ఈ ఫోటోల పైన పూనమ్ కౌర్ ఇలా రాసుకోస్తూ.. "తమ వారసత్వాలను మార్చుకొని, దుర్గుణాలను వదిలించుకొనే వ్యక్తులు.. మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించలేరు. గురు తేగ్ బహదూర్ జీ ఈ దేశం కోసం ,ధర్మం కోసం అన్నిటిని త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చుకోవడం తప్ప మరొకటి లేదు అంటూ పూనమ్ కౌర్ చేసిన ట్విట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్స్ పై పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేయగా వారికి కౌంటర్స్ కూడా వేస్తోంది పూనమ్ కౌర్. మొత్తానికి పవన్ కళ్యాణ్ పైన పూనమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: