ఈ ఏడాది అంటే 2025వ సంవత్సరం టాలీవుడ్‌కు చాలా కీలకమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కొన్ని భారీ విజయాలను సాధించగా, మరికొన్ని పూర్తిగా ప్లాప్‌గా మిగిలిపోయాయి. ఇంకొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా, అభిమానులను మాత్రం కొంతవరకు ఆకట్టుకున్నాయి. అయితే స్టార్ హీరోలు నటించినప్పటికీ కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి అనేది ఈ ఏడాది ప్రత్యేకతగా నిలిచింది.


మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘గేమ్ చేంజర్’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఈ చిత్రం, ఏడాది ఆరంభంలోనే భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా పూర్తిగా అట్టర్ ఫ్లాప్‌గా మారిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మెగా అభిమానులు కూడా ఈ సినిమాను పెద్దగా ఆదరించలేకపోయారు. సినిమా కథ, కథనం, స్క్రీన్‌ప్లే అన్నీ కలిపి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు సంబంధించిన నెగిటివ్ టాక్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.



‘గేమ్ చేంజర్’ తర్వాత కూడా ఈ ఏడాది పలు బిగ్ బడా స్టార్స్ నటించిన సినిమాలు విడుదలయ్యాయి. కానీ అవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. టాలీవుడ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేర్లు పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలే. సాధారణంగా ఈ హీరోల సినిమాలు విడుదలైతే భారీ హైప్ ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం స్టార్ పవర్ ఉన్నా కూడా సినిమాల కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు అంగీకరించరనే విషయం మరోసారి రుజువైంది.



అయితే ఈ ఏడాది మొత్తం మీద సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయిన పేరు మాత్రం స్టార్ హీరోలది కాదు. అది కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన ‘కే ర్యాంప్’ మూవీకి సంబంధించిన విషయాలు ఈ సంవత్సరం అంతా విపరీతంగా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాతో సంబంధం ఉన్న “ఇదేమిటమ్మా మాయ మాయ” అనే రీల్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ రీల్ ఎంతగా వైరల్ అయిందంటే, దాదాపు మిలియన్ల మంది అదే రీల్‌ను చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందించారు.



స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా, కిరణ్ అబ్బవరం పేరు మాత్రం ఈ ఏడాది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపించింది. సినిమాల ఫలితాల కంటే కూడా, ఒక కంటెంట్ లేదా ఒక సీన్ ఎలా ట్రెండ్ అవుతుందో ఈ ఉదాహరణ స్పష్టంగా చూపించింది. ఈ ఏడాది మొత్తంలో చూస్తే, స్టార్ హీరోలందరి కంటే కూడా కిరణ్ అబ్బవరం పేరు ఎక్కువగా వినిపించింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: