మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నయనతార కాంబినేషన్లో ఈ రోజు( జనవరి 12) విడుదలైన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ బ్యానర్, షైన్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సుస్మిత కొణిదెల ,సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ క్యాథరిన్ తో పాటుగా మరికొంతమంది నటీనటులు నటించగా హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ పాత్రలో కనిపించారు. నిన్నటి రోజున ప్రీమియర్ షోలతోనే హిట్ టాక్ సంపాదించుకుంది.


సంక్రాంతి కానుకగా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత ఆకట్టుకున్నారు చిరంజీవి . ఇటువంటి తరుణంలోనే ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారనే విషయం గురించి ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే నయనతార రూ .18 కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా చివరికి రూ. 8నుంచి రూ.10 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు సమాచారం. గెస్ట్ పాత్రలో విక్టరీ వెంకటేష్ స్క్రీన్ మీద 20 నిమిషాలు కనిపించడం కోసం ఏకంగా రూ .10 కోట్ల పైగా తీసుకున్నట్లు వినిపిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ .25 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం.


చిరంజీవి సింపుల్ ఎంట్రీ తో సినిమాలో ఎంట్రీ కనిపిస్తుంది.  సినిమాలో  సాంగ్స్, చిరంజీవి తన కామెడీ టైమింగ్ మార్కుతో అలరిస్తారు. అలాగే ఈ చిత్రంలో చిరు ఒకప్పటి సినిమాలోని డాడీ సినిమాని కూడా గుర్తుకు తెచ్చేలా సిన్స్ ఉంటాయి. తన పంచ్ డైలాగులతో వింటేజ్ చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి కొన్ని సీన్స్ అద్భుతంగా రాశారు. చిరంజీవి హుక్ స్టెప్ సాంగ్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వెంకటేష్ గెస్ట్ పాత్ర కూడా సినిమాకి మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. తన కామెడీ టైమింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు చిరంజీవి. ఎప్పటిలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్కు కామెడీతో బాగా ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: