గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా విషయంలో ఈ వివాదం మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటించి మంచి మార్కులు కొట్టేసింది. కానీ మొదటగా ఆ పాత్ర కోసం మేకర్స్ కృతి శెట్టిని అప్రోచ్ అయ్యారట. కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించిందని టాక్.ఈ విషయం బయటికి రావడంతో కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కృతి శెట్టిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. “బాలయ్య సినిమా అంటే రిజెక్ట్ చేయడమా?”, “ఇంత పెద్ద హీరో ఛాన్స్‌ను వదిలేసిందా?” అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో అది పెద్దగా వైరల్ కాకపోయినా, కృతి శెట్టి పేరు మాత్రం ట్రోలింగ్‌లోకి వెళ్లింది.
ఇప్పుడు అదే పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి సినిమా విషయంలో మళ్లీ రిపీట్ అవుతుందట. చిరంజీవి నటించబోయే ఒక అప్‌కమింగ్ సినిమాలో కూతురు పాత్ర కోసం కృతి శెట్టిని సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇంకా అధికారికంగా ఏమీ ఫిక్స్ కాలేదని సమాచారం. సినిమా చేయాలంటే స్క్రిప్ట్, పాత్ర ప్రాధాన్యం, కెరీర్ ప్లానింగ్ ఇవన్నీ చూసుకుని నిర్ణయం తీసుకోవడం సహజమే.అయితే ఇదే సమయంలో కొంతమంది మెగా ఫ్యాన్స్ కూడా కృతి శెట్టిపై విమర్శలు చేయడం మొదలుపెట్టారట. “చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే వెంటనే ఓకే చేయాలి”, “ఇలా రిజెక్ట్ చేయడం ఎందుకు?” అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే పరోక్షంగా ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… కృతి శెట్టి ఏ హీరోని అవమానించలేదు, ఏ సినిమా చేయకూడదని స్పష్టంగా చెప్పలేదు, తన కెరీర్‌కు సరిపోతుందా లేదా అన్నదే ఆమె ఆలోచన. కానీ అభిమానుల భావోద్వేగం మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. వాళ్లకు తమ హీరో పేరు వినిపించినా, ఆ సినిమాను ఎవరు రిజెక్ట్ చేసినా అది వ్యక్తిగత దాడిలా అనిపిస్తుంది. అదే కారణంగా బాలయ్య ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఇద్దరూ తెలియకుండానే కృతి శెట్టికి పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతున్నారనే చెప్పాలి.వాస్తవానికి బాలయ్య గానీ, చిరంజీవి గానీ కృతి శెట్టిపై ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్ పెట్టుకున్నారన్న ఆధారాలు లేవు. ఇది పూర్తిగా ఫ్యాన్ వార్ ప్రభావం మాత్రమే. ఒక స్టార్ హీరో సినిమా చేయడం గౌరవమే అయినా, ప్రతి హీరోయిన్ తన కెరీర్‌ను చూసుకుని నిర్ణయం తీసుకోవడం కూడా అంతే సహజం.
మొత్తానికి, ప్రస్తుతం కృతి శెట్టి ఎదుర్కొంటున్న ఈ ట్రోలింగ్ వెనక హీరోలు లేరు…అతి ఉత్సాహం చూపిస్తున్న అభిమానులే అసలు కారణం.ఇలాంటి పరిస్థితుల్లో కృతి శెట్టి ఎలా హ్యాండిల్ చేస్తుంది, భవిష్యత్తులో చిరంజీవి లేదా బాలయ్య సినిమాల్లో ఆమె కనిపిస్తుందా లేదా అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి