దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రూపొందనుందన్న వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత క్రేజీ దర్శకుల్లో ఒకరైన లోకేష్, మాస్ ఆడియన్స్‌ను ఊపేసే కథనాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి దర్శకుడు, దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ కలిగిన అల్లు అర్జున్‌తో చేతులు కలపనున్నాడన్న వార్త బయటకు రావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

వాస్తవానికి గత కొంతకాలంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారనే ప్రచారం గట్టిగానే సాగింది. ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందన్న స్థాయిలో వార్తలు కూడా వినిపించాయి. అయితే చివరి నిమిషంలో అనుకోని పరిణామాలు చోటుచేసుకోవడంతో ఆ కలయిక కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. అదే సమయంలో, ఆ స్థానంలో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం ఈ సినిమాను #AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నట్లు సమాచారం. ఈ టైటిల్ అధికారికం కాకపోయినా, ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే… ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే ‘ఇరుంబుకై మాయావి’నేనా? అనే సందేహమే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రశ్నించగా, లోకేష్ కనగరాజ్ చాలా క్లియర్‌గా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. “ప్రస్తుతం మేం ఒక ప్రాజెక్ట్‌ను మాత్రమే ప్రకటించాం. మిగతా వివరాలన్నీ నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా వెల్లడవుతాయి. ఇప్పటికి మేమొక సినిమాపై పని చేస్తున్నాం” అని మాత్రమే చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆయన వార్తలను ఖండించకపోవడం, అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ‘ఇరుంబుకై మాయావి’యేనని గట్టిగా నమ్ముతున్నారు. లోకేష్ స్టైల్ యాక్షన్, ఇంటెన్స్ కథనం, అల్లు అర్జున్ మాస్ అప్పీల్— ఉంటే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, గతంలో లోకేష్ కనగరాజ్ ఈ కథను సూర్య కోసం ప్రత్యేకంగా రాసినట్లు స్వయంగా వెల్లడించారు. దీంతో ఇప్పుడు అదే కథ అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్లిందా? అనే ప్రశ్న సూర్య అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది.

అదే సమయంలో, సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. కొంతమంది మాత్రం ఈ కథ అల్లు అర్జున్ రేంజ్‌కు సరిపడదని, బన్నీ ఇమేజ్‌కు ఇది తగ్గ ప్రాజెక్ట్ కాదని విమర్శలు చేస్తున్నారు. కావాలనే ఇలాంటి కథను ఎంచుకుని అభిమానుల ఆశలను లోకేష్ దెబ్బతీస్తున్నాడంటూ ట్రోల్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నుంచి పాన్ ఇండియా స్థాయి మాస్ ఎంటర్‌టైనర్ ఆశిస్తున్న ఫ్యాన్స్‌కు ఈ వార్తలు కొంత నిరాశ కలిగిస్తున్నాయి.అయితే, ఇవన్నీ ఊహాగానాలే తప్ప అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకుడు ఎప్పుడూ తన సినిమాల విషయంలో ప్లాన్‌తో ముందుకెళ్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ కూడా కథ, క్యారెక్టర్, స్క్రిప్ట్ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటారు. కాబట్టి ఈ కాంబినేషన్ నుంచి ఏదో స్పెషల్ రాబోతుందనే నమ్మకం చాలామందిలో ఉంది.

మొత్తానికి, లోకేష్అల్లు అర్జున్ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు, రూమర్లు, ట్రోల్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నిర్మాణ సంస్థ నుంచి వచ్చే అధికారిక ప్రకటనతోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత రానుంది. అప్పటి వరకు మాత్రం ఈ సినిమా చుట్టూ చర్చలు, అంచనాలు, హీట్ సోషల్ మీడియాలో కొనసాగడం మాత్రం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: