క్యాస్టింగ్ కౌచ్ అనేది సినీ ఇండస్ట్రీలో పాతుకు పోయింది. కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇతర రంగాల్లో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ అనే పదం వినిపిస్తుంది. అయితే రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. అసలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడడంతో కొంతమంది ఆయనపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇలాంటి విషయాలపై చాలా తొందరగా స్పందించే సింగర్ చిన్మయి తన ఎక్స్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అనే మాటల్లో ఎలాంటి నిజం లేదు.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇంకా ఉంది. ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ వల్లే చాలామంది ఆఫర్లు వదులుకుంటున్నారు. 

కమిట్మెంట్ అనే పదానికి ఇండస్ట్రీలో మరో అర్థం ఉంది. కొంతమంది దాన్ని ప్రొఫెషనలిజం అంటారు.. తాము చేసే పనికి 100% న్యాయం చేయాలి అని అంటే కచ్చితంగా తప్పే. మంచి స్థాయిలో ఉన్న పురుషులు మహిళల నుండి ఏదైనా ఆశించవచ్చు అనే కలలో బతుకుతారు.తాము ఈ స్థాయిలో ఉన్నాం. తాము డిమాండ్ చేస్తే ఒప్పుకోవాల్సిందే అనే భ్రమలో ఉంటారు.ఉదాహరణకు చూసుకుంటే నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోలోనే ఓ సింగర్ పై లైంగిక దాడి చేయాలని చూసాడు. కానీ ఆ సమయంలో ఆ సింగర్ సౌండ్ బూత్ లోకి వెళ్లి తాళం వేసుకుంది.ఆ తర్వాత ఇండస్ట్రీలోని ఓ సీనియర్ వ్యక్తి వచ్చి ఆమెను కాపాడాడు. ఆ తర్వాత ఆ సింగర్ ఆ ప్రొఫెషన్ నే వదిలేసింది. చిరంజీవి ఇండస్ట్రీలో చాలా రోజుల నుండి తన ఫ్యామిలీ ఫ్రెండ్స్,మహిళా నటీనటులు, స్నేహితులతో కలిసి పని చేస్తున్నారు.

 కానీ అలా నటించే సమయంలో గౌరవ సంస్కృతి కనిపిస్తుంది.అందుకే వారంతా లెజెండ్స్. ఇక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ వైరముత్తు అంటే నాకు చాలా గౌరవం.ఆయన్ని గురువుగా భావించాను.కానీ ఆయన మాత్రం నేను టీనేజ్ లో ఉన్నప్పుడే నాకు అసభ్య మెసేజ్లు పంపించారు. మా అమ్మ పక్కన ఉన్నా కూడా నన్ను అనుభవించాలనుకున్నారు. మహిళలకు మనం వర్క్ ఇస్తున్నాం కాబట్టి వారిని శారీరకంగా అనుభవించే హక్కు మనకు ఉంటుంది అని  అనుకునే మగవాళ్ళు ఉన్నంతకాలం ఈ సమస్య పోదు అంటూ సింగర్ చిన్మయి క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరలవ్వడంతో చాలామంది నెటిజన్స్ రీసెంట్గా చిరంజీవి సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలకే చిన్మయి కౌంటర్ ఇచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: