ఇటీవలే తెలుగు సీరియల్స్ నటి, బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న నటి కీర్తి భట్ తాను రెండు సంవత్సరాల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న నటుడు విజయ్ కార్తీక్ తో పెళ్లిపైన ప్రకటించకుండా బ్రేకప్ ప్రకటిస్తూ ఇకమీదట తాము కేవలం స్నేహితులుగానే ఉండాలని భావిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయం పైన చాలానే భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ విషయం పైన నటుడు విజయ్ కార్తీక్ స్పందించారు.



విజయ్ కార్తీక్ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. తాను ఈ విషయం మీద స్పందించాలనుకోవడం లేదు. కానీ చాలామంది ఆమెను వదిలేయొద్దు అంటూ తనకి మెసేజ్లు, ఫోన్స్ వంటివి చేస్తున్నారు. ఈ విషయంలో తాను ఆమెను వదిలేయాలనుకోలేదంటూ తెలియజేశారు. కీర్తి గారిని వదిలేయకండి కూర్చొని మాట్లాడండి అంటూ చాలానే మెసేజ్లు చేస్తున్నారు వదిలేయడం అనేది నా డెసిషన్ కాదు ఎందుకంటే , నేను కీర్తిని వివాహం చేసుకోవాలనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నానని తెలిపారు. ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలని మా కుటుంబ సభ్యులతో మాట్లాడాను అంటూ తెలిపారు.

 

అలాంటప్పుడు నేను ఎందుకు విడిపోవాలని నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు విజయ్ కార్తీక్. విడిపోవడం అనేది ఆమె సొంత నిర్ణయం. ఎందుకంటే నేను ఇంకా ఫైనాన్షియల్ గా ఏ విధంగా సెటిల్ కాలేదు, ఆమెకు స్ట్రాంగ్ గా నేను అనిపించకపోవచ్చు. ఇదే విషయంపై డిసెంబర్ లోనే చెప్పాను ఆమె ఇప్పటికే తన జీవితాన్ని ఒక కొత్తగా ప్రారంభించింది. ఆమెకు జీవితం మీద ఎలాంటి నిర్ణయమైన తీసుకొని హక్కు ఉంది. ఆ విషయాన్ని నేను గౌరవిస్తానంటూ విజయ్ కార్తీక్ తెలియజేశారు. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని చెప్పే ప్రయత్నం చేశానని తెలిపారు విజయ్ కార్తీక్ ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: