ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ఆయన కేవలం ఒక సాధారణ నటుడు కాదు, కథను మలుపు తిప్పే ఒక పరమ శివ భక్తుడి పాత్రలో కనిపిస్తారు. "వారణాసి షెడ్యూల్ పూర్తయ్యింది.. ఇది నాలోని నటుడి ఆకలిని తీర్చిన పాత్ర" అంటూ ఆయన ట్వీట్ చేయడం ఈ క్యారెక్టర్ ఎంత ఇంటెన్స్‌గా ఉంటుందో చెబుతోంది. గతంలో మహేష్ బాబుకు తండ్రిగా (దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) నటించిన ప్రకాష్ రాజ్, ఈ సినిమాలో కూడా మహేష్ తండ్రిగా కనిపిస్తారని, ఆ తండ్రి పాత్రే ఒక మహా శివ భక్తుడని టాక్ వినిపిస్తోంది.
రాజమౌళి ఈ సినిమాను సుమారు ₹1300 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నారు.సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే సాహస అన్వేషకుడిగా కనిపిస్తారు. ఆయనకు తోడుగా ఉండే ప్రకాష్ రాజ్ పాత్ర, వారణాసి నగరానికి మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన రహస్యాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తుందట. మహేష్ 'రాముడి'గా కనిపించే రామాయణం ఎపిసోడ్ లో కూడా ప్రకాష్ రాజ్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని సమాచారం."ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'రణ కుంభ' అనే వీల్ చైర్ బౌండ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. విలన్ కుంభ సైంటిఫిక్ మైండ్‌తో ఆలోచిస్తే, ప్రకాష్ రాజ్ పాత్ర ఆధ్యాత్మిక బలం మరియు అనుభవంతో మహేష్‌కు అండగా నిలుస్తుందట.గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 'మందానికి' అనే మిస్టీరియస్ పాత్రలో నటిస్తోంది. వీరి ముగ్గురితో కలిసి నటించడం చాలా ఉత్సాహంగా ఉందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను బుల్లెట్ వేగంతో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దాదాపు 60 రోజుల పాటు చిత్రీకరించిన రామాయణం ఘట్టం ఇప్పటికే పూర్తయ్యింది. ఇందులో మహేష్ శ్రీరాముడిగా కనిపించే సీన్లు హైలైట్ కానున్నాయి.తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం జార్జియా వెళ్లనుంది. అక్కడ అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేశారు.ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి తేదీని కూడా ఖరారు చేశారు. పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో ప్రత్యేకంగా విజువల్స్ డిజైన్ చేస్తున్నారు.మొత్తానికి ప్రకాష్ రాజ్ 'మహా శివ భక్తుడి'గా రాజమౌళి మార్క్ ఎమోషన్ పండించడానికి సిద్ధమయ్యారు. మహేష్ బాబు 'రుద్ర' అవతారం, ప్రకాష్ రాజ్ ఆధ్యాత్మిక బలం తోడైతే బాక్సాఫీస్ దగ్గర శివతాండవం గ్యారెంటీ! జక్కన్న ఈసారి కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదు, మన పురాణాల లోతును కూడా ప్రపంచానికి చూపించబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి