ఏంటి రామ్ చరణ్ తను నటించిన ఆ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని ఎన్నో కలలు కన్నారా..మరి ఇంతకీ రాంచరణ్ నేషనల్ అవార్డు వస్తుంది అని అనుకున్న సినిమా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ నటించిన సినిమాలలో రంగస్థలం సినిమా ఎప్పటికీ అభిమానులకు గుర్తుంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది.అంతే కాదు గతంలో రంగస్థలం సినిమా చూసిన చాలామంది రామ్ చరణ్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు పక్కా అని మాట్లాడుకున్నారు. కానీ కట్ చేస్తే ఆ సినిమాకి నేషనల్ అవార్డు రాలేదు. అయితే రంగస్థలం సినిమా విడుదలైన సంవత్సరంలో వచ్చిన ఏ సినిమా కూడా రంగస్థలం అంతా హిట్ కాలేదు. ఒకవేళ హిట్ అయినా అందులో రామ్ చరణ్ యాక్టింగ్ కంటే వేరే ఏ హీరో యాక్టింగ్ కూడా బాలేదు. 

అలా ఆ ఏడాది రామ్ చరణ్ ఖాతాలో నేషనల్ అవార్డు పడుతుందని అందరూ భావించారు. కానీ రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రాలేదు. అయితే ఈ సినిమాకి తనకి నేషనల్ అవార్డు వస్తుందని రామ్ చరణ్ కూడా భావించారట.ఈ విషయాన్ని షూటింగ్ సెట్ లో కూడా కొంతమందితో చెప్పారట. అయితే రామ్ చరణ్ చెప్పిన విషయాన్ని రంగస్థలం మూవీకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా చేసినప్పుడే రామ్ చరణ్ తనకి నేషనల్ అవార్డు వస్తుందని నాతో చెప్పారు.కానీ ఆయనకు నేషనల్ అవార్డు రాలేదు. అయితే ఈ సినిమాకి రాంచరణ్ కి నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే. కానీ ఇవ్వలేదు.

అంతేకాదు ఈ సినిమాకి వర్క్ చేసిన చాలామందికి అంటే డైరెక్టర్,హీరో ఇలా కొంతమందికి నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాం.నాకు కూడా నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నా.కానీ రాలేదు.కానీ ఈ సినిమా సౌండ్ డిజైనర్ కి నేషనల్ అవార్డు రావడంతో అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే కనీసం ఆయనకైనా వచ్చిందని. రంగస్థలం సినిమాకి నేషనల్ అవార్డ్స్ ఏమో గాని కనీసం స్టేట్ అవార్డ్స్ కూడా రాలేదు. ఈ విషయంలో చాలా ఫీలయ్యాం.ఈ సినిమా షూటింగ్ మొత్తం సెట్ వేసే చేశాం.కానీ చాలామంది ఒక పల్లెటూరులో చేశారని అనుకున్నారు. అది ఎవరు గుర్తుపట్టలేదు. అలాంటి సినిమాకి నేషనల్ అవార్డ్స్ రాష్ట్ర అవార్డ్స్ ఏవి రాకపోవడం నిజంగా బాధాకరం అంటూ రంగస్థలం సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రామకృష్ణ తన ఆవేదన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: