టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తదనంతో తెరకెక్కిన  చిన్న సినిమాలు సైతం ప్రేక్షకుల మెప్పు పొందుతాయనే సంగతి తెలిసిందే.  హర్రర్ కథాంశంతో తెరకెక్కిన సినిమాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈరోజు థియేటర్లలో రాగ మేఘ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్,  మాస్ బంక్  మూవీస్ సంయుక్తంగా  కొండా వెంకట రాజేంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన లోపలికి రా.. చెప్తా మూవీ  విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.  అంతా  కొత్తవాళ్లు  నటించిన  ఈ సినిమా  ప్రేక్షకుల అంచనాలను  అందుకోవడంతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.

కథ :

హైదరాబాద్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తూ రామ్ (రాజేంద్ర) ఎలాంటి టెన్షన్  లేకుండా జీవనం సాగిస్తూ ఉంటాడు.  వచ్చిన జీతంతో సంతృప్తిగా జీవనం సాగిస్తున్న రామ్ కు  ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర  రుక్మిణి పరిచయమవుతుంది.  పరిచయం  అయిన కొన్ని క్షణాల్లోనే రుక్మిణి నంబర్ ఇవ్వడంతో రామ్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.  అయితే రుక్మిణి  పిలవడంతో  విల్లా దగ్గర నంబర్ మార్చి వెళ్లిన రామ్ కు  వింత అనుభవాలు ఎదురవుతాయి.  రామ్ కు దెయ్యంతో  శోభనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.  కథ పరంగా వచ్చిన ట్విస్టులు ఏంటి?  రామ్  ఎలాంటి  ఇబ్బందులను ఫేస్  చేశాడు? రామ్ సమస్యలకు పరిష్కారం దొరికిందా? లేదా?  అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు  కడుపుబ్బా  నవ్విస్తూనే కొన్ని సీన్లలో భయపడితే అలాంటి సినిమాలు సక్సెస్ సాధిస్తాయని ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి.  తాజాగా విడుదలైన లోపలికి రా.. చెప్తా  సినిమా కూడా  ఆ జాబితాలో  చేరే మూవీ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.  సినిమాలో కనిపించే పాత్రలు తక్కువే అయినా ఆ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కావాల్సిన  ఎంటర్టైన్మెంట్ ను అందించాయి.

డైరెక్టర్ కమ్ హీరో  రాజేంద్ర  యూత్ ను  దృష్టిలో  పెట్టుకుని వాళ్లకు నచ్చేలా ఈ సినిమా విషయంలో  జాగ్రత్తలు తీసుకున్నారు.  110 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.  ప్రధాన పాత్రల్లో నటించిన సుస్మిత అనాలా, సాంచిరాయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.  రామ్ ఫస్ట్   నైట్ రోజు ఊహించని అనుభవాలు ఎదురవ్వడం, మరో అమ్మాయి కోసం విల్లాకు వెళ్తే  విల్లా నంబర్ మర్చి రాయడం వల్ల కొత్త సమస్యలు  క్రియేట్ కావడం  లాంటి సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా  నవ్వించాయి.

స్టోరీ లైన్ అద్భుతంగా ఉండటంతో పాటు స్క్రీన్ ప్లే కూడా బాగుండటం ఈ సినిమాకు ప్లస్  అయింది.  నైనిక, విజ్జీ పాత్రలు కథను మలుపు తిప్పుతాయి.   మంత్రగాడి పాత్రలో వంశీ నటన ఆకట్టుకునేలా ఉంది.  సినిమాలో రొమాంటిక్ ఎలిమెంట్స్  సైతం ఉన్నాయి.  ఈ వీకెండ్ మంచి మూవీ చూడాలని భావించే ప్రేక్షకులకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్  అవుతుందని కచ్చితంగా  చెప్పవచ్చు.  సూదిలో నా దారం సాంగ్ సినిమాకు హైలెట్ అయింది.

రాజేంద్ర ఈ సినిమా కోసం తన వంతు కష్టపడటంతో పాటు  ఆ కష్టానికి తగ్గ ఫలితం తెరపై వచ్చేలా చేయడంలో సఫలమయ్యారు.  హీరోయిన్లు సుష్మితా, మనీషా పాత్ర పరిధి మేర  మెప్పించారు.  బ్లాక్ స్పారో పాత్రలో  వంశీ అదరగొట్టారు. ఈగల్ ఫేమ్ డేవ్   సంగీతం, నేపథ్య సంగీతంతో మెప్పించారు. ఖర్చు విషయంలో కొంతమేర రాజీ పడినా  దర్శకుడు కమ్  హీరో రాజేంద్ర బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చారు.  సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి.

బాటమ్ లైన్ : హర్రర్, కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించే లోపలికి రా.. చెప్తా

రేటింగ్ :  2.75/5.0  

మరింత సమాచారం తెలుసుకోండి: