శంకర్ సినిమాలో నాయికగా అవకాశం వస్తే తప్పకుండా ఆ హీరోయిన్ రేటు నెక్స్ట్ రేంజ్ ను తాకుతుంది. ఇప్పడు ఎమీ చేస్తున్న పని అదే. 1942 లవ్ స్టోరీ చిత్రం ద్వారా ఎమీ జాక్సన్ తెలుగు వారికి పరిచయమే. తమిళంలో ఈ చిత్రం మదరాసిపట్టణంగా చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పడు ఎమీ చేతిలో ఓ బాలీవుడ్ సినిమా, తెలుగులో చరణ్ చిత్రం, తమిళంలో శివతాండవం, శంకర్ ఐ సినిమాలున్నాయి. ఇన్ని సినిమాల్లో నటిస్తున్నా ఎవరైనా కాల్షీట్ అడిగితే లేవనకుండా ఇస్తోంది ఎమీ. కానీ ఒక్క షరతును విధిస్తుంది. అది పారితోషికానికి సంబంధించిన వ్యవహారం. కోటి రూపాయలకు ఒక్క పైసా తక్కువున్నా సినిమా గురించి మాట్లాడవద్దన్నది ఆ షరతు. .
మరింత సమాచారం తెలుసుకోండి: