సొట్టబుగ్గల చిన్నది ప్రీజి జింటా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. రాజకుమారుడు, ప్రేమ అంటే ఇదేరా. వంటి సినిమాలతో ఇక్కడి వారినీ ఆకట్టుకుంది. కాగా.. ఈ బాలీవుడ్ భామకు ఇప్పడు చేతిలో పెద్దగా సినిమాలు లేవు.
కాగా, తానే నిర్మాతగా నిర్మిస్తున్న ఇష్క్ ఇన్ పారీస్ సినిమా అక్టోబర్ 5న విడుదల అవుతుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్స్ విడుదల అయ్యాయి. ప్రీతి జింటా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ ఇష్క్ ఇన్ పారీస్ ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచలేక పోతున్నాయి. నిర్మాతగా మారిన ప్రీతి జింటాకు కాలం కలసి వస్తుందో.. లేదో.. తెలియాలంటే వేచి చూడాల్సిందే..!
మరింత సమాచారం తెలుసుకోండి: