గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్లు చేస్తున్న ఫిర్యాదు చేస్తున్న విషయం తెలిసిందే.  గతంలో తమపై చేసిన లైంగిక దాడులపై ఇప్పుడు ఒక్కో హీరోయిన్ బయట పెడుతున్నారు.  అయితే వీటిని కొంత మంది సమర్థించినా మరికొంత మంది కావాలనే..పాపులారిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొట్టి పడేస్తున్నారు.  తాజాగా బాలీవుడ్ క్విన్ కంగనా రౌన్ ప్రముఖ దర్శకుడు వికాస్ బెహెల్ పై చేసిన ఆరోపణలు బాలీవుడ్ లో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. 

ఈ మద్య తనుశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ పై చేసిన ఆరోపణలు ఇంకా మరువక ముందే..ఇప్పుడు కంగనా రౌనత్ చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  తాజగా కంగనా చేసిన ఆరోపణలపై మరో నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ, కొన్నిసార్లు కంగన చేసే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం కష్టమని, అయినప్పటికీ ఆమె తనకు జరిగిన ఘటనల గురించి ధైర్యంగా బయటపెట్టడం అభినందించదగ్గ విషయమని..ఈ విషయంలో ఆమెను తాను గౌరవిస్తానని చెప్పింది.

ఈ విషయంపై కంగనాకు చిర్రెత్తుకొచ్చింది.  ‘కొన్నిసార్లు కంగన చేసే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం కష్టం’ అన్న సోనమ్ వ్యాఖ్యలకు అర్థమేంటని ప్రశ్నించింది. కొందరు మహిళలను మాత్రమే నమ్మాలన్న లైసెన్స్ ఆమెకు ఉందా? నేను చెప్పేవి తప్పని ఆమె ఎలా చెప్పగలుగుతంది? అంటూ మండిపడింది.  తాను ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చానని..వారసత్వంగా రాలేదని..అయినా సోనమ్ కపూర్ గొప్ప నటేమి కాదని, గొప్పగా మాట్లాడుతుందన్న పేరు కూడా లేదని విమర్శించింది. ఇలాంటి సినీ సెలబ్రిటీలకు తన గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తుంది కంగనా. 


మరింత సమాచారం తెలుసుకోండి: