మాజీమంత్రి టిడిపి సీనియర్ నేత ఈసారి భీమిలిపట్నం సీటును ఏరి కోరి మరి తీసుకున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే గంటా శ్రీనివాస్ కు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విషయంలో ఎదురుదెబ్బలు తగలబోతోంది. స్థానికంగా ఉన్న బలమైన సామాజిక వర్గానికి చెందిన అక్కడి నేత గాజు గ్లాస్ గుర్తు కేటాయించినట్లు సమాచారం.. పద్మనాభ అనే అభ్యర్థికి భీమిలి మండలాలలో ఎక్కువ సంఖ్యలో బలమైన సామాజిక వర్గం కలిగిన అభ్యర్థి. ఈయనకు గాజు గ్లాస్ గుర్తు రావడంతో అక్కడ టిడిపి కొనప ముంచేలా కనిపిస్తోందట.


2019లో భీమిలి నుంచి జనసేన పోటీ చేయగా పాతికవేల ఓట్లు దాకా అక్కడ సంపాదించుకుంది.. ఈసారి భీమిలి లో ఇండిపెండెంట్ అభ్యర్థి పద్మనాభ సగం ఓట్లు చీలిస్తే ఈ మేరకు టిడిపికి చాలా లాస్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన నేతలు తమకే టికెట్ వస్తుందని భావించినప్పటికీ రాకపోయేసరికి చాలా సతమతమవుతున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే పలువురు జనసేన నేతలు గాజు గ్లాసుతో జనంలోకి పెద్ద ఎత్తున వెళ్లి ప్రచారం చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అలా గాజు గ్లాస్ అందరికీ వరంగా మారుతోంది.


దీంతో ఓట్లు వేళలో పడతాయనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. గంట తన సెంటిమెంట్ ని పక్కన పెట్టి మరి ఈసారి పోటీ చేసిన చోటనే రెండవసారి పోటీ చేయబోతున్నారు.. 2014 నుంచి 19 మధ్యలో ఎమ్మెల్యేగా మంత్రిగా జనాలకు అందుబాటులో లేరని విమర్శలు కూడా ఎక్కువగా వినిపించాయి. దీంతో కొంతమేరకు ఆయనకు అసంతృప్తి ఉందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ జనంలో ఎక్కువగా పట్టు సాధించారు. దీంతో కచ్చితంగా ఈసారి అక్కడ గంటాకు టైట్ ఫిట్ నడుస్తుందని వాదన వినిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే గాజు గ్లాస్ సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ గాజు దెబ్బ ఎవరికి గుచ్చుకుంటుందో.. ఎవరు కొంప ముంచుతుందో తెలియదు కానీ.. టిడిపి శిబిరంలో మాత్రం గాజు గ్లాస్ కలవరపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: