తన అందాలతో కుర్రకారును ఆకట్టుకున్న ముద్దుగుమ్మ ఛార్మీకు ఇప్పుడు ఛాన్సులు తగ్గిన సంగతి తెలిసిందే. తన సొగసుల కంటే తక్కువ సోకు ఉన్న వారు దూసుకు పోతుంటే ఛార్మి మాత్రం ఢీలా పడిపొతుంది. అయితే తనకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ధీమాగా ఉంది. ఐటెం సాంగులకు, చిన్న పాత్రలకు కూడా సై అంటుంది. కాగా, చార్మీ తాజాగా ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది. వరుణ్ సందేశ్ హీరోగా భానుశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న జుమ్ జుమ్ మాయ సినిమాలో ఛార్మి నటిస్తుంది. ఈ సినిమాలో ఛార్మి సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరోను ఆట పటిస్తూ సాగే తన పాత్ర అభినయానికి ఎక్కువ ప్రాధన్యత ఉండే విధంగా సాగుతాదని ఛార్మి అంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: