అందాల తమన్నా ఇప్పడు వరస చిత్రాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె నటించిన రెబల్ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహించాడు.
అలాగే పవన్ కళ్యాణ్ తో తమన్నా తొలిసారిగా నటిస్తున్న కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమా అక్టోబర్ 18న విడుదల అవుతుంది. ఈ చిత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో రూపుదిద్దుకుంటోంది. ఈ రెండు చిత్రాల గురించి ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, తమన్నా ప్రస్తుతం ‘హిమ్మత్ వాలా’ అనే హిందీ సినిమాలో నటిస్తుంది. కాగా తమన్నా కు మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. తమిళంలో హిట్టయిన రమణ (తెలుగులో ఠాగూర్)ను జయం రవి దర్శకత్వంలో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం తమన్నా ఎంపిక అయింది. తమిళ, తెలుగు లలో విజయం సాధించిన ఈ సినిమా హిందీలోనూ సక్సెస్ సాధిస్తుందని అంతా నమ్ముతున్నారు.
దీంతో అంచనాలతో రూపొందుతున్న సినిమాలలో తమన్నాకు అవకాశాలు వస్తుండంతో, ఇప్పుడంతా తమన్నా టైం నడుస్తుందని, తమన్నా టైం బావుందని అంతా కామెంట్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి